
క్రికెట్‌లో గాయాలు సహజమే. ఒక్కోసారి ఇవి తీవ్రంగా ఇబ్బంది పెడుతుంటాయి. దీంతో బ్యాటింగ్ లేదా బౌలింగ్ చేయడం చాలా కష్టమవుతుంది. అయితే జెంటిల్మెన్ గేమ్‌గా భావించే క్రికెట్‌లో పోరాటస్ఫూర్తికి కొదవేం లేదు. బెర్ట్ సట్‌క్లిఫ్, అనిల్ కుంబ్లే, గ్రేమ్ స్మిత్ ఇలా ఎంతో మంది గాయాలతోనే గ్రౌండ్‌లోకి దిగారు. తమ జట్టును గెలిపించేందుకు శాయశక్తులా ప్రయత్నించారు. ఇప్పుడీ జాబితాలోకి ఆస్ట్రేలియా ఆఫ్ స్పిన్నర్ నాథన్ లయోన్ చేరాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో జరుగుతున్న రెండో టెస్ట్ రెండో రోజు లయోన్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతను డ్రెస్సింగ్ రూమ్‌కే పరిమితమయ్యాడు. అయితే నాలుగోరోజు నాలుగో రోజు ఆస్ట్రేలియా జట్టు తమ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తోంది. అప్పటికే జట్టు కూడా గణనీయమైన ఆధిక్యాన్ని సాధించింది. అయితే వరుసగా వికెట్లు పడ్డాయి. ఆస్ట్రేలియా ఆధిక్యం 355 పరుగులకు చేరుకోగా, తొమ్మిదో వికెట్ పడింది. దీంతో మ్యాచ్ రెండో రోజు గాయపడిన చివరి బ్యాటర్ నాథన్ లియాన్ మాత్రమే అందుబాటులో ఉన్నాడు. అయితే జట్టుకు తన అవసరం ఉండడంతో ఏ మాత్రం సంకోచించకుండా బ్యాటింగ్‌కు వచ్చాడు నాథన్. నొప్పిని భరిస్తూ కుంటుతూ మైదానంలోకి వస్తుంటే స్టేడియంలోని ప్రేక్షకులంతా లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. ఇక ఔటై వెళ్లిపోతున్నప్పుడు కూడా చప్పట్లు కొడుతూ స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు.
మిచెల్ స్టార్క్‌తో కలిసి ఆఖరి వికెట్‌ఖు 15 పరుగులు జోడించారు లయోన్. దీని ఆధారంగా ఇంగ్లండ్ ముందు ఆస్ట్రేలియా 371 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇది చిన్న భాగస్వామ్యమే కావచ్చు.. కానీ గాయాన్ని లెక్కచేయకుండా బ్యాటింగ్ చేసిన లయోన్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆసీస్ ఆటగాడి పోరాట స్ఫూర్తి, ఆట పట్ల అతనికున్న కమిట్మెంట్‌కు అందరూ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం నాథన్ లయోన్ బ్యాటింగ్‌కు వస్తోన్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలతో తెగ వైరలవుతున్నాయి. కాగా ఈ టెస్టులోనూ ఆసీస్ విజయం దిశగా సాగుతోంది. కడపటి వార్తలందే సమయానికి ఇంగ్లండ్ 5 వికెట్ల నష్టానికి178 పరుగులు చేసింది. విజయం సాధించాలంటే ఆ జట్టు ఇంకా 193 పరుగులు చేయాల్సి ఉంది.
Fair play Nathan Lyon 👏 #EnglandCricket | #Ashes pic.twitter.com/ZiqstQkU16
— England Cricket (@englandcricket) July 1, 2023
🇦🇺 Australia all out for 2️⃣7️⃣9️⃣
A huge effort from all our bowlers in the afternoon session! 💪
🏴 We need 3️⃣7️⃣1️⃣ to win! #EnglandCricket | #Ashes
— England Cricket (@englandcricket) July 1, 2023
Rehan Ahmed that is just ridiculous 😆👏 #EnglandCricket | #Ashes pic.twitter.com/NaxtuUD7X7
— England Cricket (@englandcricket) July 1, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..