RCB: కోహ్లీ టీం ఆఫర్ ఇస్తే వద్దన్నాడు.. కట్ చేస్తే.. ఈ ప్లేయర్ ఇప్పుడేం చేస్తున్నాడో తెలిస్తే

|

Aug 28, 2024 | 8:57 PM

దూకుడైన ఆటతీరు కనబరిచే వీరేంద్ర సెహ్వాగ్‌కు ఓ బౌలర్ తలనొప్పిగా మారాడు. అతడు మరెవరో కాదు.. ఆస్ట్రేలియా ఎడమచేతి ఫాస్ట్ బౌలర్ నాథన్ బ్రాకెన్. ఇతడి కోసం ఐపీఎల్ ఫ్రాంచైజీ ఆర్సీబీ కోట్లు ఖర్చు చేసింది. కానీ లీగ్ ఆడేందుకు నిరాకరించాడు.

RCB: కోహ్లీ టీం ఆఫర్ ఇస్తే వద్దన్నాడు.. కట్ చేస్తే.. ఈ ప్లేయర్ ఇప్పుడేం చేస్తున్నాడో తెలిస్తే
T20 Cricket
Follow us on

దూకుడైన ఆటతీరు కనబరిచే వీరేంద్ర సెహ్వాగ్‌కు ఓ బౌలర్ తలనొప్పిగా మారాడు. అతడు మరెవరో కాదు.. ఆస్ట్రేలియా ఎడమచేతి ఫాస్ట్ బౌలర్ నాథన్ బ్రాకెన్. ఇతడి కోసం ఐపీఎల్ ఫ్రాంచైజీ ఆర్సీబీ కోట్లు ఖర్చు చేసింది. కానీ లీగ్ ఆడేందుకు నిరాకరించాడు. ఐపీఎల్‌లో కోట్ల ఆఫర్ తిరస్కరించిన ఈ ప్లేయర్ ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెల్సా..

2009లో చివరి అంతర్జాతీయ మ్యాచ్..

46 ఏళ్ల బ్రాకెన్ అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమై దశాబ్దానికి పైగా గడిచింది. అతడు 2009లో ఆస్ట్రేలియా తరపున తన చివరి మ్యాచ్ ఆడాడు. ఆస్ట్రేలియా తరపున మూడు ఫార్మాట్లలో ఆడిన బ్రాకెన్.. 200కి పైగా వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అత్యధికంగా వన్డేల్లో 174 వికెట్లు పడగొట్టాడు.

ఇది చదవండి: ముంబై‌కి కొత్త కెప్టెన్‌గా టీ20 డైనమైట్.. హార్దిక్‌కు కూడా హ్యాండిచ్చేసిందిగా 

RCB ఆఫర్‌కు నో..

2011లో మోకాలి గాయం కారణంగా క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన నాథన్ బ్రాకెన్‌తో ఐపీఎల్‌లో ఆర్సీబీ టీం రూ. 1.3 కోట్లతో ఒప్పందం కుదుర్చుకోవాలనుకుంది. కానీ, ఈ లెఫ్టార్మ్ ఆస్ట్రేలియా బౌలర్ ఒప్పందాన్ని నిరాకరించాడు. ఐపీఎల్‌లో కోట్ల ఆఫర్‌ను తిరస్కరించిన ఈ బౌలర్.. ప్రస్తుతం సిడ్నీలోని ఒక కంపెనీలో అకౌంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. మరోవైపు భారత్‌తో టెస్టుతో అరంగేట్రం చేసిన నాథన్ బ్రాకెన్.. సెహ్వాగ్‌ను తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు. నాథన్ బ్రాకెన్, వీరేంద్ర సెహ్వాగ్ అంతర్జాతీయ క్రికెట్‌లో 16 ఇన్నింగ్స్‌లలో ఒకరినొకరు ఎదుర్కొన్నారు. టెస్ట్, వన్డే, టీ20 కలిపి 16 ఇన్నింగ్స్‌లలో, సెహ్వాగ్‌కు 148 పరుగులు సమర్పించి.. అతడ్ని 7 సార్లు అవుట్ చేశాడు బ్రాకెన్.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..