T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్‌పై నమీబియా జట్టు విజయం సాధించింది. నిర్ణీత 20 ఓవర్‌లలో స్కాట్లాండ్ ఇచ్చిన 110 పరుగుల లక్ష్యాన్ని నమీబియా విజయవంతంగా చేధించింది. నాలుగు వికెట్ల తేడాతో టోర్నీలో నమీబియా తొలి విజయాన్ని సొంతం చేసుకుంది. నమీబియా బ్యాట్స్‌మెన్స్‌లో విలియమ్స్ 23 పరుగులు, జేజే స్మిత్ 33 పరుగులతో రాణించడంతో సునాయాసంగా విజయ తీరాలను చేరుకోగలిగింది. నమీబియా బ్యాట్స్‌మెన్స్‌లో లింగెన్ 18 పరుగులు, డేవిడ్ 16 పరగులతో జట్టు స్కోరు పెరగడంలో కీలక పాత్ర పోషించారు.
ఇక అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన స్కాట్లాండ్ ఆరంభం నుంచే తడబడింది. నమీబియా బౌలర్ల ధాటికి స్కాట్లాండ్ తొలి ఓవర్‌లోనే మూడు వికెట్లు కోల్పోయింది. అయితే ఆ తర్వాత ఇతర బ్యాట్స్‌మెన్ రాణించడంతో ఆ మాత్రం స్కోరునైనా సాధించగలిగింది. స్కాట్లాండ్ బ్యాట్స్‌మెన్‌లో మైఖేల్ లియాస్క్ (44) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. నమీబియా బౌలర్లలో ట్రంపుల్మన్ మూడు, జాన్ ఫ్రైలింక్ రెండు, డేవిడ్ వైస్, స్మిత్ తలో వికెట్ తీశారు.
Also Read: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ చెల్లిస్తున్న బ్యాంకులు
Pushpa: పుష్ప నుంచి మూడో సాంగ్.. గురువారం ఉదయం ‘సామీ సామీ’ పాట విడుదల..
Pushpa: పుష్ప నుంచి మూడో సాంగ్.. గురువారం ఉదయం ‘సామీ సామీ’ పాట విడుదల..