Sri Lanka vs Namibia T20 World Cup: ‘క్రికెట్‌ ప్రపంచమా.. ఇకపై ఆ పేరు గుర్తుపెట్టుకో’ వైరల్‌ అవుతున్న సచిన్ టెండుల్కర్ ట్వీట్‌

క్వాలిఫైయింగ్‌ మ్యాచ్‌లో శ్రీలంకకు షాకిస్తూ ఘన విజయం సాధించిన నమీబియా క్రికెట్ జట్టుపై పలువురు క్రికెటర్లు, అభిమానులు ప్రశంశలు కురిపిస్తున్నారు. ఈ సందర్భంగా భారత క్రికెటర్‌ సచిన్‌ టెండుల్కర్‌ ..

Sri Lanka vs Namibia T20 World Cup: క్రికెట్‌ ప్రపంచమా.. ఇకపై ఆ పేరు గుర్తుపెట్టుకో వైరల్‌ అవుతున్న సచిన్ టెండుల్కర్ ట్వీట్‌
Sachin Tendulkar tweet on Namibia team

Updated on: Oct 17, 2022 | 1:19 PM

టీ20 ప్రపంచకప్‌ ఓపెనింగ్‌ మ్యాచ్‌లో శ్రీలంకకు గట్టి దెబ్బ తగిలింది. ఆదివారం (అక్టోబర్‌ 16) జరిగిన టీ20 ప్రపంచకప్‌ తొలి రౌండ్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో నమీబియా 55 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులతో డిఫెండింగ్‌లో ఉన్న నమీబియా శ్రీలంకను 19 ఓవర్లలో 108 పరుగులకే పరిమితం చేసింది. ఆల్‌రౌండర్లైన జాన్ ఫ్రైలింక్, జేజే స్మిత్ కీలక ఇన్నింగ్స్‌ అందించారు. జాన్ ఫ్రైలింక్ 28 బంతుల్లో 44 పరుగులు చేశాడు. ఇక జేజే స్మిత్ 16 బంతుల్లో 31 పరుగులు చేయడంతో స్కోర్‌ అమాంతంగా పెరిగిపోయింది. కేవలం 7 వికెట్లకు ఏకంగా 163 పరుగులు చేసింది.

అనంతరం శ్రీలంకను 19 ఓవర్లలో 108 పరుగులకు ఆలౌట్ చేసింది. నమీబియా తరఫున బెన్ షికోంగో, జాన్‌ ఫ్రైలింక్‌, బెర్నార్డ్, డేవిడ్ వైస్.. ఒక్కొక్కరు రెండేసి వికెట్లు తీయగా, జేజే స్మిత్ ఒక వికెట్ తీసి గెలుపులో కీలకంగా వ్యవహరించారు.

ఇవి కూడా చదవండి

క్వాలిఫైయింగ్‌ మ్యాచ్‌లో శ్రీలంకకు షాకిస్తూ ఘన విజయం సాధించిన నమీబియా క్రికెట్ జట్టుపై పలువురు క్రికెటర్లు, అభిమానులు ప్రశంశలు కురిపిస్తున్నారు. ఈ సందర్భంగా భారత క్రికెటర్‌ సచిన్‌ టెండుల్కర్‌ ‘పేరు గుర్తుపెట్టుకోమని.. నమీబియా ఈ రోజు ప్రపంచ క్రికెట్‌కు సందేశం పంపిందని’ తన ట్విటర్ ఖాతాలో పోస్టు పెట్టారు. దీంతో సచిన్‌ ట్వీట్‌ నెట్టింట వైరల్‌ అయ్యింది. ఇప్పటికే సచిన్‌ ట్వీట్‌కు 63 వేలకు పైగా లైకులు రావడం విశేషం.