ఇంగ్లాండ్‌తో ఓటమి తర్వాత లంకేయుల దిద్దుబాటు చర్యలు… సీనియర్ ఆటగాళ్లతో సాంకేతిక సలహా కమిటీ ఏర్పాటు

శ్రీలంక క్రికెట్ బోర్డ్ సలహా కమిటీని ప్రకటించింది. ఇందులో ఆ దేశ దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్, మాజీ కెప్టెన్​ కుమార సంగక్కరను సలహా కమిటీ సభ్యులుగా తీసుకుంది. సాంకేతిక సలహా కమిటీలో...

ఇంగ్లాండ్‌తో ఓటమి తర్వాత లంకేయుల దిద్దుబాటు చర్యలు... సీనియర్ ఆటగాళ్లతో సాంకేతిక సలహా కమిటీ ఏర్పాటు
Sri Lanka cricket committee
Follow us
Sanjay Kasula

|

Updated on: Feb 06, 2021 | 6:25 PM

Sri Lanka Cricket Board : శ్రీలంక క్రికెట్ బోర్డ్ సలహా కమిటీని ప్రకటించింది. ఇందులో ఆ దేశ దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్, మాజీ కెప్టెన్​ కుమార సంగక్కరను సలహా కమిటీ సభ్యులుగా తీసుకుంది. సాంకేతిక సలహా కమిటీలో నలుగురితో కలిపి ఓ టీమ్ తయారు చేసింది బోర్డు.

శ్రీలంక క్రీడా మంత్రి నమల్ రాజపక్స ఆదేశాల మేరకు బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. మాజీ బ్యాట్స్​మన్ అరవింద డి సిల్వాను సలహా కమిటీ అధ్యక్షుడిగా శ్రీలంక క్రికెట్ బోర్డు నియమించింది. మాజీ బ్యాట్స్​మన్​, ఐసీసీ మ్యాచ్​ రిఫరీ రోషన్ మహానమాను కూడా కమిటీలో సభ్యుడిగా చేర్చింది.

సొంత గడ్డపై ఇంగ్లాండ్​తో రెండు టెస్ట్​ సిరీస్​లలో ఓటమిపాలైన నేపథ్యంలో సలహా కమిటీ నూతన సభ్యులను నియమించింది. ఇందుకోసం పలుమార్లు క్రీడామంత్రితో చర్చలు జరిపింది. చివరి ఈ నిర్ణయం తీసుకుంది. వీరు రాబోయే రోజుల్లో జట్టు ఎంపికలో తీసుకోవల్సిన జాగ్రత్తలు.. కొత్త ఆటగాళ్ల ఎంపిక వంటి అంశాలు ఈ కమిటీ సభ్యులు ఫోకస్ పెడుతారు.

ఇవి కూడా చదవండి :

ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. మోడల్ పేపర్లలో కీలక మార్పులు.. విడుదల చేసిన తెలంగాణ ఇంటర్ బోర్డ్..! AP Corona Bulletin : ఏపీ కరోనా బులెటిన్ విడుదల.. గత 24 గంటల్లో కొత్త కరోనా కేసులు ఎన్నంటే..! AP Local Body Elections : ఎవరూ మమ్మల్ని నిందించొద్దు.. ఎస్‌ఈసీ నిమ్మగడ్డను కలిసిన ఉద్యోగ సంఘాల నేతలు