CWC 2023: వన్డే వరల్డ్ కప్ భారత్‌దే..! చెప్పకనే చెప్పేసిన ‘చంద్రయాన్ 3’.. వైరల్ అవుతున్న ట్వీట్..

|

Aug 24, 2023 | 7:25 AM

CWC 2023: 2019 వరల్డ్ కప్‌ టోర్నీలో భారత్ సెమీఫైనల్ వరకు చేరి ఆపై వెనుదిరిగింది. అలాగే అదే సంవత్సరం భారత్ చేపట్టిన చంద్రయాన్ 2 కూడా లాండింగ్ సమస్యలతో విఫలమైంది. ఇలా 2019లోనే వరల్డ్ కప్‌లో భారత జట్టు, చంద్రునిపై చంద్రయాన్ 2 విఫలమయ్యాయి. అప్పుడు రెండు ఫెయిల్ అయ్యాయి కానీ ఇప్పుడు అలా కాదు అన్నట్లుగా ముంబై ఇండియన్స్ ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేసింది. యావత్ భారతదేశం గర్వపడేలా చంద్రయాన్ 3 మిషన్ విజయవంతం అయింది. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ కూడా చంద్రుడిపై కాలు..

CWC 2023: వన్డే వరల్డ్ కప్ భారత్‌దే..! చెప్పకనే చెప్పేసిన ‘చంద్రయాన్ 3’.. వైరల్ అవుతున్న ట్వీట్..
Chandrayaan-3; ODI World Cup 2023
Follow us on

CWC 2023: భారత్ వేదికగా ఆక్టోబర్ 5 నుంచి వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్ జరగనున్న సంగతి తెలిసిందే. ఆ లోపే భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 3 మిషన్ విజయవంతం అయింది. ఇదే ఇప్పుడు భారత జట్టు అభిమానుల్లో  వరల్డ్ కప్ ఆశలను మరింత పెంచింది. అదేలా అంటే.. 2019 వరల్డ్ కప్‌ టోర్నీలో భారత్ సెమీఫైనల్ వరకు చేరి ఆపై వెనుదిరిగింది. అలాగే అదే సంవత్సరం భారత్ చేపట్టిన చంద్రయాన్ 2 కూడా లాండింగ్ సమస్యలతో విఫలమైంది. ఇలా 2019లోనే వరల్డ్ కప్‌లో భారత జట్టు, చంద్రునిపై చంద్రయాన్ 2 విఫలమయ్యాయి. అప్పుడు రెండు ఫెయిల్ అయ్యాయి కానీ ఇప్పుడు అలా కాదు అన్నట్లుగా ముంబై ఇండియన్స్ ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేసింది.

యావత్ భారతదేశం గర్వపడేలా చంద్రయాన్ 3 మిషన్ విజయవంతం అయింది. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ కూడా చంద్రుడిపై కాలు మోపాయి. ఈ క్రమంలో వన్డే వరల్డ్ కప్‌లో భారత్ కూడా విజయ వంతం అవుతుందని అర్థం వచ్చేలా ముంబై ఇండియన్స్ ఓ మీమ్ షేర్ చేసింది. ముంబై ఇండియన్స్ షేర్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఫిక్స్ చేసేయండి.. 

కాగా, జూలై 14న లాంచ్ అయిన చంద్రయాన్ 3.. బుధవారం అంటే ఆగస్టు 23న సాయంత్రం 5:47 గంటలకు చంద్రునిపై ల్యాండింగ్, సాయంత్రం 6:04 గంటలకు చంద్రునిపై చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్‌ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఇస్రోకి బీసీసీఐ, టీమిండియా ఆటగాళ్లు అభినందనలు తెలిపారు.

చరిత్ర సాక్షాత్కారం..

చారిత్రాత్మకం..

తొలి దేశం..

 దేశం గర్విస్తోంది..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..