MI vs KKR Playing 11: టాస్ గెలిచిన ముంబై.. ప్లేయింగ్ 11లో కీలక మార్పులు..

Mumbai Indians vs Kolkata Knight Riders, 12th Match: ఈరోజు ఐపీఎల్ 2025లో భాగంగా 5 సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ 3 సార్లు ఛాంపియన్ కోల్‌కతాతో తలపడుతోంది. ఈ మ్యాచ్ ముంబై సొంత మైదానం వాంఖడేలో జరుగుతుంది. ఈ సీజన్‌లో ముంబై తొలిసారి ఇక్కడ ఆడుతోంది. వరుసగా రెండు పరాజయాల తర్వాత వాంఖడే చేరుకున్న ముంబై జట్టు.. పాయింట్ల పట్టికలో తన ఖాతాను తెరవాలని కోరుకుంటుండగా, కోల్‌కతా ఒక ఓటమి, ఒక విజయంతో హార్దిక్ పాండ్యా సేనను ఢీ కొట్టేందుకు సిద్ధమైంది.

MI vs KKR Playing 11: టాస్ గెలిచిన ముంబై.. ప్లేయింగ్ 11లో కీలక మార్పులు..
Mumbai Indians Vs Kolkata Knight Riders, 12th Match

Updated on: Mar 31, 2025 | 7:15 PM

Mumbai Indians vs Kolkata Knight Riders, 12th Match: ఈరోజు ఐపీఎల్ 2025లో భాగంగా 5 సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ 3 సార్లు ఛాంపియన్ కోల్‌కతాతో తలపడుతోంది. టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో కేకేఆర్ బ్యాటింగ్‌కు సిద్ధమైంది.  ముంబై తరపున అశ్విని కుమార్ అరంగేట్రం చేస్తున్నారు. విఘ్నేష్ పుత్తూరు కూడా ప్లేయింగ్-11లో చేరాడు. మరోవైపు, సునీల్ నరైన్ కోల్‌కతాకు తిరిగి వచ్చాడు. అనారోగ్యం కారణంగా అతను చివరి మ్యాచ్ ఆడలేదు. ఈ మ్యాచ్ ముంబై సొంత మైదానం వాంఖడేలో జరుగుతుంది. ఈ సీజన్‌లో ముంబై తొలిసారి ఇక్కడ ఆడుతోంది. వరుసగా రెండు పరాజయాల తర్వాత వాంఖడే చేరుకున్న ముంబై జట్టు.. పాయింట్ల పట్టికలో తన ఖాతాను తెరవాలని కోరుకుంటుండగా, కోల్‌కతా ఒక ఓటమి, ఒక విజయంతో హార్దిక్ పాండ్యా సేనను ఢీ కొట్టేందుకు సిద్ధమైంది.

కోల్‌కతాపై ముంబైకి అద్భుతమైన రికార్డు ఉంది. రెండు జట్ల మధ్య జరిగిన 34 మ్యాచ్‌లలో, మెన్ ఇన్ బ్లూ 23 విజయాలు సాధించగా కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కేవలం 11 విజయాలు మాత్రమే సాధించగలిగింది. కానీ, గత కొన్ని మ్యాచ్‌లలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు గత 6 మ్యాచ్‌ల్లో 5 గెలవడం గమనార్హం. ముంబై ఇండియన్స్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఇంకా వెన్ను గాయం నుంచి కోలుకోలేదు. కానీ, కేకేఆర్ ఆల్ రౌండర్ సునీల్ నరైన్ ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉన్నాడు. అతని రాకతో జట్టు మరింత బలపడింది.

ఇరు జట్లు:

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్ (w), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, అజింక్యా రహానే (సి), రింకు సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, స్పెన్సర్ జాన్సన్, హర్షిత్ రాణా, వరుణ్ చకరవర్తి.

ఇవి కూడా చదవండి

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్, విల్ జాక్స్(w), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, అశ్వనీ కుమార్, విఘ్నేష్ పుత్తూర్.

రెండు జట్ల ఇంపాక్ట్ ప్లేయర్లు:

కోల్‌కతా నైట్ రైడర్స్ ఇంపాక్ట్ ప్లేయర్లు: అన్రిచ్ నార్ట్జే, అనుకుల్ రాయ్, మనీష్ పాండే, వైభవ్ అరోరా, లువ్నిత్ సిసోడియా.

ముంబై ఇండియన్స్ ఇంపాక్ట్ ప్లేయర్లు: రోహిత్ శర్మ, కార్బిన్ బాష్, రాజ్ బావా, రాబిన్ మింజ్, సత్యనారాయణ రాజు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..