ఐపీఎల్2022 (IPL 2022)లో ఈరోజు డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్(Mumbai Indians vs Delhi Capitals) మధ్య జరగనుంది. రెండు జట్లలోనూ చాలా మంది స్టార్ ప్లేయర్లు ఉన్నారు. ముంబై గురించి మాట్లాడితే, ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ(Rohit Sharma) బ్యాటింగ్‌తో బాగా రాణించగలరు. అయితే ఢిల్లీకి, కెప్టెన్ రిషబ్ పంత్, పృథ్వీ షాపై చూపులు నిలిచాయి. ఇటువంటి పరిస్థితిలో, ప్లేయింగ్-11లో ఏ ఆటగాళ్లకు చోటు దక్కనుందో ఓసారి తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. అలాగే ఫాంటసీ ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉంటుందో వివరంగా తెలసుకుందాం.
వికెట్ కీపర్లు..
మ్యాచ్‌లో రిషబ్ పంత్, ఇషాన్ కిషన్‌లను వికెట్ కీపర్‌లుగా చేర్చవచ్చు. పంత్ గత సీజన్‌లో 16 మ్యాచ్‌లు ఆడి 34.91 సగటుతో 419 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో పంత్ స్ట్రైక్ రేట్ 147.46గా ఉంది. వేగంగా పరుగులు చేయడంలో పేరుగాంచాడు. అదే సమయంలో ముంబై టీంలో వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్ బరిలోకి దిగనున్నాడు. గత సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో కిషన్ 16 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో అతను 32 బంతుల్లో 84 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అంతకుముందు రాజస్థాన్ రాయల్స్‌పై కూడా ఇషాన్ 25 బంతుల్లో అజేయంగా 50 పరుగులు చేశాడు. ఇక ఫాంటసీ-11లో ఇషాన్‌ను కెప్టెన్‌గా, రిషబ్ పంత్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంచుకోవచ్చు.
బ్యాటర్లు..
ఫాంటసీ-11 కోసం రోహిత్ శర్మ, పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్, టిమ్ డేవిడ్‌లను జట్టులోకి తీసుకోవచ్చు. మూడు ఫార్మాట్లలో టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రోహిత్‌కి ఇదే తొలి ఐపీఎల్. హిట్‌మ్యాన్ 213 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 130.39 సగటుతో 5,611 పరుగులు చేశాడు. ముంబైకి ఓపెనింగ్‌గా రోహిత్ కనిపించనున్నాడు. అదే సమయంలో, ఢిల్లీ తరపున గత సీజన్‌లో, పృథ్వీ షా 159.13 స్ట్రైక్ రేట్‌తో 479 పరుగులు చేశాడు.
ఢిల్లీ జట్టు తమతో పాటు సర్ఫరాజ్ ఖాన్‌ను కూడా వేలంలో చేర్చుకుంది. రంజీ సీజన్‌లో ఈ ముంబై ప్లేయర్ అద్భుత ఫామ్‌ను కనబరిచాడు. అతను రంజీ ట్రోఫీలో 301, 226,177, 275 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. అదే సమయంలో, టిమ్ డేవిడ్‌పై ముంబై జట్టు కూడా భారీగానే ఆశలు పెట్టుకుంది. వేలంలో రూ. 8.25 కోట్లు వెచ్చించి ముంబై అతడిని జట్టులో చేర్చుకుంది. హార్దిక్ పాండ్యాలా లాంగ్ సిక్సర్లు కొట్టడంలో అతనికి పేరుంది. ఫాంటసీలో డేవిడ్ మీకు మంచి పాయింట్లను పొందగలడు. అతని T20 కెరీర్ స్ట్రైక్ రేట్ 158.52గా నిలిచింది.
ఆల్ రౌండర్లు..
కీరన్ పొలార్డ్, లలిత్ యాదవ్ ఈ మ్యాచ్‌లో ఆల్ రౌండర్లుగా బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. పొలార్డ్ బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ అద్భుతాలు చేయగలడు. పొలార్డ్ 178 IPL మ్యాచ్‌లలో 149.77 స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేశాడు. అతని పేరు మీద 65 వికెట్లు కూడా ఉన్నాయి. గతేడాది చెన్నైపై పొలార్డ్ 34 బంతుల్లో అజేయంగా 87 పరుగులు చేసి చెన్నై నుంచి విజయాన్ని కొల్లగొట్టాడు. అదే సమయంలో, ఢిల్లీకి చెందిన లలిత్ యాదవ్ కూడా ఆకట్టుకునే ఛాన్స్ ఉంది. T20 కెరీర్ స్ట్రైక్ రేట్ 145.41గా ఉంది. ఇఖ 47 టీ20 మ్యాచ్‌లు ఆడి 32 వికెట్లు కూడా పడగొట్టాడు.
బౌలర్లు..
బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, మయాంక్ మార్కండేలను ఫాంటసీ ప్లేయింగ్ 11 జట్టులో చేర్చుకోవచ్చు. బుమ్రా ఐపీఎల్‌లో 106 మ్యాచ్‌లలో 130 వికెట్లు పడగొట్టాడు. అతను తన బౌలింగ్‌తో ఎలాంటి మ్యాచ్‌నైనా మార్చగలడు. లార్డ్ శార్దూల్ గత సీజన్‌లో చెన్నైకి అద్భుతమైన ప్రదర్శన చేశాడు. 16 మ్యాచుల్లో 21 వికెట్లు తీశాడు. తాజాగా అతను బ్యాట్‌తో కూడా టీమిండియాకు అద్భుతాలు చేస్తున్నాడు. అదే సమయంలో, మయాంక్ గురించి మాట్లాడితే, అతను గతంలో ముంబై తరపున కూడా ఆడాడు. అతను ఇప్పటివరకు 18 మ్యాచ్‌లు ఆడి 8.54 ఎకానమీతో 16 వికెట్లు తీశాడు. 23 పరుగులకే 4 వికెట్లు తీయడం అతని అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది.
ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాబబుల్ ప్లేయింగ్ XI:
పృథ్వీ షా, టిమ్ సీఫెర్ట్, రిషబ్ పంత్ (కెప్టెన్ & కీపర్), మన్‌దీప్ సింగ్, రోవ్‌మన్ పావెల్, సర్ఫరాజ్ ఖాన్/లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, చేతన్ సకారియా, ఖలీల్ అహ్మద్
ముంబై ఇండియన్స్ ప్రాబబుల్ ప్లేయింగ్ XI:
రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (కీపర్), తిలక్ వర్మ, అన్మోల్‌ప్రీత్ సింగ్, టిమ్ డేవిడ్, కీరన్ పొలార్డ్, ఫాబియన్ అలెన్, జయదేవ్ ఉనద్కత్, మయాంక్ మార్కండే, టైమల్ మిల్స్, జస్ప్రీత్ బుమ్రా
Also Read: Watch Video: డీజే బ్రావో స్టైలే వేరు.. వికెట్ తీస్తే మైదానంలో తీన్మారే.. వైరల్ వీడియో