IPL 2025: ఐపీఎల్ ప్రారంభానికి ముందే ముంబై ఇండియన్స్‌కు భారీ ఎదురు దెబ్బ.. స్టార్ ప్లేయర్ ఔట్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభానికి ఇంకా కొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది. కానీ అంతకు ముందే టైటిల్ హాట్ ఫేవరెట్, మాజీ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ముంబై కీలక ప్లేయర్ ఒకరు ఐపీఎల్ సీజన్ 18 నుంచి తప్పుకున్నాడు.

IPL 2025: ఐపీఎల్ ప్రారంభానికి ముందే ముంబై ఇండియన్స్‌కు భారీ ఎదురు దెబ్బ.. స్టార్ ప్లేయర్ ఔట్
Mumbai Indians

Updated on: Feb 12, 2025 | 11:17 PM

ఈ ఏడాది ఐపీఎల్ మెగా వేలంలో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు అల్లా గజన్‌ఫర్‌ను ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ రూ.4.80 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఇప్పుడీ స్టార్ ప్లేయర్ ఐపీఎల్ 18 నుంచి తప్పుకున్నాడు. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో అల్లా గజన్‌ఫర్ ఎముక విరిగింది. ఈ గాయం కారణంగా రాబోయే 4 నెలలు ఆటకు దూరంగా ఉంటాడు. అందువల్ల, అల్లా గజన్‌ఫర్ రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీ. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లకు అందుబాటులో ఉండడం లేదు. ఇంతలో, అల్లా గజన్‌ఫర్ జట్టు నుంచి తప్పుకోవడంతో, ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రత్యామ్నాయంగా విదేశీ ఆటగాడిని ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. ఇటీవల ముగిసిన దక్షిణాఫ్రికా టీ20 లీగ్ లేదా ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో ప్రత్యేకంగా రాణించిన ఆటగాళ్లను ఎంపిక చేసుకునే అవకాశం ముంబై ఇండియన్స్‌కు ఉంది. అందువల్ల, ముంబై జట్టులోకి బలమైన ఆటగాడి ప్రవేశం కోసం మనం ఎదురు చూడవచ్చు

అల్లా గజన్‌ఫర్ ఇప్పటివరకు 19 T20 మ్యాచ్‌లు ఆడాడు. ఈ సమయంలో అతను 397 బంతులు వేసి 30 వికెట్లు పడగొట్టాడు. అది కూడా 6.12 సగటుతో. అందుకే ఈ ఏడాది ఐపీఎల్ మెగా వేలం ద్వారా ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ఏకంగా రూ.4.80 కోట్లకు అమ్ముడుపోయింది. అయితే ఇంతలోనే గాయం నుంచి తప్పుకోవడంతో ముంబై టీమ్ కు గట్టి ఎదురు దెబ్బ తగిలినట్టేనని చెప్పుకోవచ్చు.
ముంబై ఇండియన్స్ జట్టు: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, తిలక్ వర్మ, ట్రెంట్ బౌల్ట్, నమన్ ధీరే, రాబిన్ మింజ్, కర్ణ్ శర్మ, దీపక్ చాహర్, రీస్ టోప్లీ, ర్యాన్ రికెల్టన్, విల్ జాక్స్, మిచెల్ సాంట్నర్, కర్ణ్ శర్మ, రాజ్వా శర్మ, సత్యనారాయణ రాజు, రాజ్ బావా, కృష్ణన్ శ్రీజిత్, అశ్వని కుమార్, బెవాన్ జాకబ్స్, అర్జున్ టెండూల్కర్, లిజ్ విలియమ్స్.

ఇవి కూడా చదవండి

అల్లా గజన్‌ఫర్‌ గాయంపై ఆఫ్గన్ క్రికెట్ బోర్డు అధికారిక ప్రకటన..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..