IPL 2021: ఆటగాళ్లకు జీపీఎస్‌ వాచ్‌లు.. ముంబై ప్లేయర్లపై సరికొత్త ప్రయోగం.. ఎందుకో తెలుసా?

|

Aug 14, 2021 | 9:46 PM

Mumbai Indians: ఇప్పటికే దుబాయ్ చేరిన సీఎస్‌కే టీంలోని ఆటగాళ్లకు మాత్రం జీపీఎస్ వాచీలను అందించకపోవడం గమనార్హం.

IPL 2021: ఆటగాళ్లకు జీపీఎస్‌ వాచ్‌లు.. ముంబై ప్లేయర్లపై సరికొత్త ప్రయోగం.. ఎందుకో తెలుసా?
Mumbai Indians
Follow us on

Mumbai Indians: కరోనా నేపథ్యంలో భారత్‌లో వాయిదా పడిన ఐపీఎల్ 14వ సీజన్‌.. వచ్చె నెల నుంచి యూఏఈ వేదికగా మొదలుకానుంది. ఈమేరకు చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్‌లోని కొంతమంది ఆటగాళ్లు ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. రెండవ భాగంలో తొలి మ్యాచులో సీఎస్‌కే వర్సెస్ ముంబై ఇండియన్స్ టీంలు తలపడనున్న సంగతి తెలిసిందే. దీంతో అక్కడికి చేరుకున్న పలువురు ఆటగాళ్లు కొద్ది రోజులు క్వారంటైన్‌లో ఉండాల్సి వస్తోంది. దాదాపు వీరు ఆరురోజుల పాటు అబుదాబిలో క్వారంటైన్‌లో ఉండాల్సి వస్తోంది. అయితే ఆటగాళ్లు క్వారంటైన్ నిబంధనలను కచ్చితంగా పాటించేందుకు వారిపై ముంబై మేనేజ్‌మెంట్ నిఘా వేసింది. దీనికోసం వారి కదలికలను గుర్తించేందుకు అబుదాబి ప్రభుత్వం జీపీఎస్‌ వాచీలను అందించింది. జీపీఎస్‌ ట్రాకింగ్‌ ద్వారా క్వారంటైన్ టైంలో ఉల్లంఘ‌న‌ల‌కు పాల్పడకుండా చూసేందుకు ఈ వాచీలను అందించింది.

అబుదాబిలో క్వారెంటైన్ రూల్స్ చాలా క‌ఠినంగా ఉంటాయి. దుబాయ్ నుంచి అబుదాబికి వెళ్లాలంటే కచ్చితంగా కోవిడ్ నెగ‌టివ్ రిపోర్ట్ చూపించాల్సిందే. దీంతో ఆటగాళ్లు క్వారంటైన్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించింది.

ఇప్పటికే దుబాయ్ చేరిన సీఎస్‌కే టీంలోని ఆటగాళ్లకు మాత్రం జీపీఎస్ వాచీలను అందించకపోవడం గమనార్హం. క్వారంటైన్ స‌మ‌యంలో ప్రతిరోజు ఆట‌గాళ్లకు కోవిడ్ ప‌రీక్షలు చేస్తారు. కాగా, సెప్టెంబ‌ర్ 19న దుబాయ్‌లో చెన్నై, ముంబై మ్యాచ్‌తో ఐపీఎల్ 2021 రెండో దశ పోటీలు మొదలుకానున్నాయి.

Also Read: టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత క్రీడాకారులకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తేనీటి విందు.. చిత్రాలు…

177 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్.. జట్టు విజయానికి బలమైన పునాది వేసిన టీమిండియా బ్యాటర్

KL Rahul: ‘రెండేళ్ల క్రితం జట్టు నుంచి తొలగించినప్పుడు ఏం జరిగిందంటే..’! ఆనాటి రహస్యాన్ని చెప్పిన కేఎల్ రాహుల్