SRH vs MI : 14 పరుగుల తేడాతో ఓడిన హైదరాబాద్.. ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ముంబై విజయం

|

Apr 18, 2023 | 11:36 PM

ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 192 పరుగులు చేసింది. లీగ్‌లో అత్యంత విజయవంతమైన జట్టు ముంబై ఈ సీజన్‌ని సరిగ్గా ప్రారంభించలేదు. తన తొలి మ్యాచ్‌లో బెంగళూరు చేతిలో, రెండో మ్యాచ్‌లో చెన్నై చేతిలో ఓడిపోయింది.

SRH vs MI : 14 పరుగుల తేడాతో ఓడిన హైదరాబాద్.. ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ముంబై విజయం
Mumbai Indians
Follow us on

ఐపీఎల్ 2023 లో నేడు హైదరాబాద్, ముంబై మధ్య మ్యాచ్ జరిగింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో ముంబై ఘనవిజయం సాధించింది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 192 పరుగులు చేసింది. లీగ్‌లో అత్యంత విజయవంతమైన జట్టు ముంబై ఈ సీజన్‌ని సరిగ్గా ప్రారంభించలేదు. తన తొలి మ్యాచ్‌లో బెంగళూరు చేతిలో, రెండో మ్యాచ్‌లో చెన్నై చేతిలో ఓడిపోయింది. ఆ తర్వాత ఢిల్లీ, కోల్ కతాలను ఓడించింది. ముంబైకి ఇది ఐదో మ్యాచ్‌.

ఈ మ్యాచ్ చాలా ఉత్కంఠగా సాగింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి 14 పరుగుల తేడాతో గెలిచి హ్యాట్రిక్‌ కొట్టింది. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్‌ నిర్ణీత 19.5 ఓవర్లలో 178 పరుగులకు ఆలౌట్‌ అయింది.

మయాంక్‌ అగర్వాల్‌ 41 బంతుల్లో 48 పరుగుకు చేశాడు. హెన్రిచ్‌ క్లాసెన్‌ 16 బంతుల్లో 36 పరుగులు రాణించినప్పటికీ జట్టును విజయతీరాలకు తీసుకెళ్లలేకపోయారు. మంబయి బౌలర్లలో జాసన్‌ బెహ్రాండర్ఫ్‌, పియూశ్‌ చావ్లా, మెరిడిత్‌ తలో రెండు వికెట్లు తీయగా, అర్జున్‌ తెందుల్కర్‌, కామెరూన్‌ గ్రీన్‌ చెరో వికెట్‌ తీశారు.