Happy Birthday Dhoni: గ్రాండ్‌గా మిస్టర్‌ కూల్‌ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. పార్టీలో సర్‌ప్రైజ్‌ ఎంట్రీ ఇచ్చిన ఆ స్టార్‌ క్రికెటర్‌..

Mahendra Singh Dhoni Birtday: 3 ఐసీసీ ట్రోఫీలు, నాలుగు ఐపీఎల్‌ టైటిల్స్‌, 2 ఛాంపియన్స్‌ లీగ్‌ టీ20 ట్రోఫీలు, టెస్ట్‌ ర్యాంకింగ్స్‌ లో నెంబర్‌ వన్‌ పొజిషన్‌.. వ్యక్తిగతంగా వన్డే క్రికెట్‌లో 10 వేల పరుగులు.. ఇలా చెప్పుకుంటూ పోతే..

Happy Birthday Dhoni: గ్రాండ్‌గా మిస్టర్‌ కూల్‌ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. పార్టీలో సర్‌ప్రైజ్‌ ఎంట్రీ ఇచ్చిన ఆ స్టార్‌ క్రికెటర్‌..
Happy Birthday Dhoni

Updated on: Jul 07, 2022 | 10:03 AM

Mahendra Singh Dhoni Birtday: 3 ఐసీసీ ట్రోఫీలు, నాలుగు ఐపీఎల్‌ టైటిల్స్‌, 2 ఛాంపియన్స్‌ లీగ్‌ టీ20 ట్రోఫీలు, టెస్ట్‌ ర్యాంకింగ్స్‌ లో నెంబర్‌ వన్‌ పొజిషన్‌.. వ్యక్తిగతంగా వన్డే క్రికెట్‌లో 10 వేల పరుగులు.. ఇలా చెప్పుకుంటూ పోతే మహేంద్ర సింగ్‌ ధోని (Mahendra Singh Dhoni )రికార్డులకు కొదవేలేదు. కెప్టెన్‌ కూల్‌గా భారత క్రికెట్‌ జట్టులో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ దిగ్గజ క్రికెటర్‌ నేడు 41వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు జార్ఖండ్‌ డైనమైట్‌ కు బర్త్‌ డే విషెస్‌ చెబుతున్నారు. క్రికెట్‌లో ధోనీ సాధించిన రికార్డులు, స్పెషల్ మూమెంట్స్‌ని ఫొటోలు, వీడియోల రూపంలో షేర్ చేసుకుంటున్నారు. ఈక్రమంలోనే ప్రస్తుతం ట్విట్టర్‌లో #HBDMSDhoni అనే హాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది.

గ్రాండ్‌గా బర్త్‌ డే సెలబ్రేషన్స్‌..

కాగా ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి బ్రిటన్‌ వెకేషన్‌ లో ఉన్నాడు. ఈ సందర్భంగా తన భార్య సాక్షి, కొద్దిమంది స్నేహితుల సమక్షంలో కేక్ కట్ చేసి బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నాడు. బుధవారం అర్ధరాత్రి జరిగిన ఈ వేడుకలకు టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ కూడా హాజరయ్యాడు. ధోనీ బర్త్ డే సెలబ్రేషన్స్ వీడియోను సాక్షి సింగ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీంతో ఈ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. ఆగస్టు 15, 2020న అంతర్జాతీ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన ధోని ప్రస్తుతం కేవలం ఐపీఎల్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..