
MS Dhoni Comments on RCB: మిస్టర్ కూల్ ఎంఎస్ ధోని తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలతో హాట్ టాపిక్ గా మారాడు. ఐపీఎల్ 2025 ట్రోఫీని గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై తన అభిప్రాయం తెలిపాడు. తొలిసారి ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన బెంగళూరు జట్టుకు తనమైన శైలిలో శుభాకాంక్షలు చెప్పుకొచ్చాడు. మరో టీం ఐపీఎల్ ట్రోఫీ గెలవడం నేను ఊహించలేదంటూ చెప్పుకొచ్చాడు. తాజాగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన ధోని పై విధంగా స్పందించాడు.
‘నేను సీఎక్కే జట్టులో మెంబర్ గా ఉంటున్నాను. మరో టీం ట్రోఫీ గెలవాలని కోరుకోను. అయితే, 2025లో తొలి ట్రోఫీ నెగ్గిన ఆర్సీబీ, చాలా ఏళ్లుగా చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించడం సంతోషం. ప్రత్యర్థి జట్ల నుంచి మనం ఎంతో నేర్చుకోవాల్సి ఉంటుంది’ అంటూ చెన్నై సూపర్ కింగ్స్ సీనియర్ ప్లేయర్ చెప్పుకొచ్చాడు.
అలాగే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఫ్యాన్స్ ను కూడా ధోని ప్రశంసించాడు. జట్టుకు ఎన్నో ఏళ్లుగా అండగా నిలిచారని, గెలిచినప్పుడే కాదు, ఓడిన సమయంలోనూ వెంట ఉన్నారంటూ కితాబిచ్చాడు. ఎళ్లవేళలా జట్టును ఉత్సాహపరిచేందుకు స్టేడియాలకు వచ్చినందుకు ప్రత్యేకంగా అభినందించాడు.
MS Dhoni candid response to a fan asking how he felt after RCB winning 2025 IPL . #MSDhoni pic.twitter.com/BkP71runjz
— Yash MSdian ™️ 🦁 (@itzyash07) January 21, 2026
కాగా, ఐపీఎల్ 2026కు రంగం సిద్ధమైంది. ధోని ఇప్పటికే తన సన్నాహాలు మొదలు పెట్టాడు. కాగా, ఈ ఏడాది ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అంతా భావిస్తున్నారు. ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.. ఈ ఏడాది మరో టైటిల్ ఖాతాలో వేసుకోవాలని కోరుకుంటోంది. అటు యువ ఆటగాళ్లు, ఇటు సీనియర్లతో చెన్నై జట్టు కొత్త ఉత్సాహంతో కనిపిస్తోంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..