Dhoni Food Habit: బటర్ చికెన్ తింటాడు.. కానీ, అందులో.. ధోనీ ఫుడ్ సీక్రెట్స్ బయటపెట్టిన ఉతప్ప..

Robin Uthappa and MS Dhoni: ఎంఎస్ ధోనీకి ఉన్న వెరైటీ ఆహారపు అలవాట్లను టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప వెల్లడించాడు. ఆహారం విషయానికి వస్తే, ధోని కొంచెం భిన్నంగా ఉంటాడని చెప్పుకొచ్చాడు.

Dhoni Food Habit: బటర్ చికెన్ తింటాడు.. కానీ, అందులో.. ధోనీ ఫుడ్ సీక్రెట్స్ బయటపెట్టిన ఉతప్ప..
Ms Dhoni

Updated on: Mar 19, 2023 | 2:10 PM

Robin Uthappa on MS Dhoni: ఎంఎస్ ధోనీకి ఉన్న వెరైటీ ఆహారపు అలవాట్లను టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప వెల్లడించాడు. ఆహారం విషయానికి వస్తే, ధోని కొంచెం భిన్నంగా ఉంటాడని చెప్పుకొచ్చాడు. ధోనీ బటర్ చికెన్ తింటాడని, కానీ చికెన్ తినడని వెల్లడించాడు. జియో సినిమాలో ప్రసారం కానున్న ‘మై టైమ్ విత్ హీరోస్’ షోలో ఉతప్ప ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు.

రాబిన్ ఉతప్ప చాలా కాలంగా ధోనీతో డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఐపీఎల్ వరకు ఇద్దరూ కలిసే ఉన్నారు. టీ20 ప్రపంచ కప్ 2007 విజేత జట్టులో ఇద్దరు ఆటగాళ్లు కూడా సభ్యులుగా ఉన్న సంగతి తెలిసిందే. గత IPL సీజన్ వరకు ఇద్దరూ చెన్నై సూపర్ కింగ్స్‌లో కలిసి ఉన్నారు. ఇటువంటి పరిస్థితిలో ఈ ఇద్దరు ఆటగాళ్లకు ఒకరి అలవాట్లు ఒకరికి బాగా తెలుసు.

బటర్ చికెన్‌లో నో చికెన్..

ఉతప్ప మాట్లాడుతూ, ‘మేం ఎప్పుడూ కలిసి తినేవాళ్లం. మాకు ఒక గ్రూప్ ఉంది. అందులో సురేష్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, ఆర్‌పీ సింగ్, పీయూష్ చావ్లా, మునాఫ్ పటేల్, ఎంఎస్ ధోని, నేను ఉన్నాం. మేం దాల్ మఖానీ, బటర్ చికెన్, జీరా ఆలూ, క్యాబేజీ, రోటీస్ ఆర్డర్ చేసేవాళ్లం. ఇక్కడి ఆహారం విషయంలో ధోనీ భిన్నంగా ఉంటాడే. అతను బటర్ చికెన్ తింటాడు. కానీ, చికెన్ లేకుండా తింటాడు. గ్రేవీతో రోటీ మాత్రమే తింటాడు. మరోసారి చికెన్ తింటుంటే మాత్రం రోటీ తినడని అర్థం చేసుకోవాలి’ అని చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

ఉతప్ప మాట్లాడుతూ, ‘నేను మొదటిసారి CSKలో చేరినప్పుడు, జట్టులోని ప్రతి ఒక్కరూ అతనిని మహి భాయ్ అని పిలువడం నేను చూశాను. నేను ధోని వద్దకు వెళ్లి, నేను కూడా మహి భాయ్ అని పిలవాలా అని అడిగాను, దానికి ధోని నిరాకరించాడు. నువ్వు ఎలా పిలవాని అనుకుంటే అలా పిలవొచ్చు అని అన్నాడు. మహి అని పిలిచినా చాలు అని చెప్పినట్లు తెలిపాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..