Azadi Ka Amrit Mahotsav: స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో సంబరాలు చేసుకుంటోంది. మువ్వన్నెల జెండా గొప్పతనం తెలిసేలా హర్ ఘర్ తిరంగా పేరుతో స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రధాన నరేంద్రమోడీతో సహా అందరూ తమ సోషల్ మీడియా ఖాతాలను త్రివర్ణ పతకాలతో కూడిన డీపీలు పెడుతున్నారు. అదేవిధంగా వాట్సప్ స్టేటస్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్‌ల్లోనూ ఫొటోలు షేర్ చేసుకుంటూ మురిసిపోతున్నారు. ఈక్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (Mahendra Singh Dhoni) ఈ జాబితాలో చేరాడు. ఈ మధ్యన సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా ఉండని మిస్టర్ కూల్ ఇన్‌స్టాగ్రామ్‌లో మువ్వన్నెల జండాను తన డిసప్లే పిక్చర్‌గా మార్చేశాడు. ‘భారతీయుడినైనందుకు నా జన్మ ధన్యమైంది’ అని అర్థం వచ్చేలా హిందీ, ఇంగ్లిష్, సంస్కృత భాషల్లో ఓ కోట్‌ను అందులో జోడించాడు.
సోషల్ మీడియాలో పెద్దగా చురుగ్గా ఉందని ధోని అప్పుడప్పుడు మాత్రమే పోస్టులు షేర్ చేస్తుంటాడు. తన గారాలపట్టితో దిగిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తుంటాడు. ఇందుకోసం జీవాసింగ్ ధోని పేరుతో ప్రత్యేక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను క్రియేట్ చేశారు ధోనీ దంపతులు. ఇదిలా ఉంటే భారత క్రికెట్‌కు ధోని సేవలను గుర్తించిన ప్రభుత్వం అతనికి టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ హోదా కల్పించింది. 2018లో తన టెరిటోరియల్ ఆర్మీ యూనిఫాంతోనే మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిద్ చేతుల మీదుగా ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డును స్వీకరించాడు. ఇక 2019లో పారాచూట్ రెజిమెంట్‌తో ఒక నెలకు పైగా శిక్షణ కూడా తీసుకున్నాడు.
MS Dhoni Dp says it all!
I am blessed to be a Bharatiya??
And whole nation is so blessed to have you Mahi❤️ @msdhoni | #MSDhoni | #Thala pic.twitter.com/xl6dAehRcP— Anjali ♡ (@imAnjalii718) August 12, 2022
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..