
ప్రస్తుతం ఇంగ్లండ్‌తో భారత క్రికెట్ జట్టు టెస్ట్ సిరీస్ ఆడుతోంది. క్రికెట్ అభిమానులందరి కళ్లు ఈ సిరీస్‌పైనే ఉన్నాయి. అయితే ఈ సిరీస్ పూర్తయిన వెంటనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ జరగనుంది. ఈ సీజన్ చాలా ప్రత్యేకం.
ఎందుకంటే మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఇది ఐపిఎల్ఆఖరి సీజన్ అని ప్రచారం జరుగుతోంది. అటువంటి పరిస్థితిలో ధోనీ ఐపీఎల్‌లో తన అభిమానులను అలరించేందుకు బాగానే సిద్ధమవుతున్నాడు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం (జనవరి 26) మహేంద్ర సింగ్ ధోనీ రాంచీలోని తన ఫాంహౌస్‌లో మువ్వెన్నెల జెండాను ఆవిష్కరించి దేశ భక్తిని చాటుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ధోనీ భార్య సాక్షి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇందులో ధోనీ.. భారీ జెండాను చూస్తూ నిల్చొన్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విశేషమేమిటంటే ఇందులో MS ధోని సరికొత్త లుక్‌లోకనిపించడం. పొడవాటి జుట్టు, తెల్లటి గడ్డంతో సరికొత్త లుక్‌లో సర్‌ప్రైజ్ చేశాడు మిస్టర్ కూల్. ఈ వీడియోను చూసి అభిమానులు, నెటిజన్లు పాత ధోని మళ్లీ వచ్చాడంటూ క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. ఈ ఫొటోను చెన్నై సూపర్ కింగ్స్ కూడా ట్విట్టర్ లో షేర్ చేసింది. వన్ నేషన్ వన్ ప్రైడ్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
43 ఏళ్ల ఎంఎస్ ధోని ఈసారి ఐపీఎల్‌లో చివరిసారిగా కనిపించవచ్చని తెలుస్తోంది. అభిమానులు ఇచ్చిన ప్రేమను తిరిగి ఇవ్వాలనుకుంటున్నట్లు ధోనీ ఇప్పటికే స్పష్టం చేశాడు. అభిమానులు మళ్లీ పాత ధోనీని చూసేలా జుట్టు పొడవుగా పెంచడానికి కారణం ఇదే. MS ధోని 2020 సంవత్సరంలో అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. అయితే ఐపీఎల్ ద్వారా తన ఫ్యాన్స్‌ను అలరిస్తూనే ఉన్నాడు. కానీ ఈ సీజన్‌లో ధోని మొత్తానికే క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నాడని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ ఏడాది జూన్‌లో ధోనీ మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ప్రస్తుతం దీని నుంచి కోలుకుంటున్నాడు. త్వరలోనే ఫూర్తి ఫిట్ నెస్ సాధించి IPL 2024 కు అందుబాటులో ఉంటాడని భావిస్తున్నారు.
Hip hip hurrah! 🤩🥳
Go well, Jeppiaar MHSS, in the finals of the Jr. Super Kings Inter School T-20 Championship 2023-24 👏🏽#TheRoarStartsHere pic.twitter.com/Bw3EOv1b3C
— Chennai Super Kings (@ChennaiIPL) January 25, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..