ఎంఎస్ ధోని భారత క్రికెట్ ప్రేమికులకు అదొక తారకమంత్రం. ధోనీ క్రికెటర్ మాత్రమే కాదు.. మంచి ఫుట్ బాల్ ప్లేయర్, బైక్స్ నడపడం హాబీ.. అంతేకాదు వ్యవసాయం చేయడం అంటే మక్కువ.. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. దేశాన్ని అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. క్రికెటర్ గా ఎంత అంకిత భావంతో ఆడతాడో.. దేశం పట్ల అంతే అంకిత భావంతో ఉంటాడు. ధోనికి భారత సైన్యంలో ఒక మంచి స్థానం ఉంది. నేడు ధోనీ 42వ పుట్టిన రోజు జరుపుకుంటున్న నేపథ్యంలో ధోనికి ఆర్మీ జర్నీగురించి తెలుసుకుందాం..
2011లో ధోనీ కెప్టెన్సీలో భారతదేశం ప్రపంచ కప్ ను అందుకుంది. ఈ సమయంలో భారత సైన్యంలో భాగమైన టెరిటోరియల్ ఆర్మీ ధోనికి గౌరవ లెఫ్టినెంట్ పదివినిచ్చి గౌరవించింది. అప్పటి నుండి ధోనీ వివిధ సమయాల్లో భారత ఆర్మీకి సంబంధించిన కార్యక్రమాలు, శిక్షణలో పాల్గొంటున్నాడు. 2018లో పద్మభూషణ్‌తో సత్కరించినప్పుడు కూడా ఆర్మీ యూనిఫారంలోనే ఆ కార్యక్రమానికి హాజరయ్యాడు. అవార్డును అందుకున్నాడు.
15 వేల అడుగుల నుంచి దూకిన ధోనీ
టెరిటోరియల్ ఆర్మీ తర్వాత 2014లో, ధోనీ 106 ఇన్‌ఫాంట్రీ బెటాలియన్ TA పారాలో భాగమయ్యాడు. ఇది భారత సైన్యంలోని ఎలైట్ ఫోర్స్. ఇందులో భాగమైన తర్వాత భారత్‌లో ఇప్పటివరకు ఏ ఆటగాడు చేయని శిక్షణను ధోనీ తీసుకున్నాడు. తన శిక్షణను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేశాడు. 2015 ఆగష్టులో ధోని దాదాపు రెండు వారాల కఠోర శిక్షణ తీసుకున్నాడు. అనంతరం ఆగ్రాలో తొలిసారిగా 15,000 అడుగుల ఎత్తు నుంచి ‘పారా జంప్’ చేశాడు
Mahender Singh Dhoni does para jumping in Agra pic.twitter.com/hSxqKmIetU
— ANI (@ANI) August 19, 2015
ఈ సమయంలో ధోనీ ఈ పారా జంప్ లను 4 సార్లు పగలు చేయగా.. ఒకసారి రాత్రి చేశాడు. దీన్ని పూర్తి చేసిన ధోనీ మిగిలిన సైనికులతో పాటు వింగ్స్ (యూనిఫాంలో నీలం రంగు రెక్కలు, పారాచూట్ గుర్తు) అందుకున్నాడు.
ఆర్మీ జవాన్ గా పాకిస్తాన్ సరిహద్దు దగ్గర గస్తీ తిరిగిన ధోనీ
జవాన్ గా తాను అందరిలానే విధులను నిర్వహిస్తానని.. చెప్పకనే చెప్పాడు ధోనీ.. అంతే కాదు సరిహద్దు ప్రాంతానికి వెళ్లి ధోనీ పెట్రోలింగ్ డ్యూటీని కూడా పూర్తి చేశాడు. 2019లో ప్రపంచ కప్ సెమీ-ఫైనల్స్‌లో భారత దేశం ఓటమి పొంది.. బయటకు వచ్చింది. ఆ సమయంలో ధోని స్పెషల్ ఫోర్స్ యూనిట్‌లో చేరాడు.
ఈ సమయంలో ధోనీ జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న పోస్ట్‌లో సుమారు రెండు వారాల పాటు గడిపాడు. బోర్డర్ వద్ద జవాన్ గా గస్తీ కాసాడు.
స్పెషల్ ఫోర్సెస్, ఆర్మీకి ధోనీ ఎంతగానో అనుబంధంగా ఉన్నాడని చెప్పడానికి ఇంకా చాలా ఉదాహరణలు ఉన్నాయి . 2019 ప్రపంచ కప్‌కు ముందు ఆడిన సిరీస్‌లో, ధోనీ తన వికెట్ కీపింగ్ గ్లోవ్స్‌లో స్పెషల్ ఫోర్స్ ‘త్యాగం’ గుర్తు ఉన్న బ్యాడ్జ్ ను ధరించాడు. అయితే ఐసీసీ ఆర్డర్ తర్వాత అతను దానిని తొలగించాల్సి వచ్చింది. ఇది మాత్రమే కాదు చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీపై ఆర్మీ పోరాట యూనిఫాంను కలిపి తయారు చేయడంలో ధోనీ ఆలోచన ఉంది.
Lt. Colonel Mahendra Singh Dhoni spotted playing volleyball with his Para Territorial Battalion!💙😊
Video Courtesy : DB Creation #IndianArmy #MSDhoni #Dhoni pic.twitter.com/H6LwyC4ALb
— MS Dhoni Fans Official (@msdfansofficial) August 4, 2019
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..