ఛాంపియన్స్‌ ట్రోఫీ సెలెక్షన్‌.. డైరెక్ట్‌గా రోహిత్‌ శర్మపై సిరాజ్‌ కామెంట్స్‌! ఏమన్నాడంటే..?

|

Mar 26, 2025 | 1:36 PM

చాంపియన్స్ ట్రోఫీలో ఎంపిక కాలేకపోవడంపై మొహమ్మద్ సిరాజ్ స్పందిస్తూ, రోహిత్ శర్మ తీసుకున్న నిర్ణయం సరైనదేనని అన్నారు. దుబాయ్ పిచ్‌లకు అనుగుణంగా జట్టును ఎంపిక చేశారని తెలిపారు. ఐపీఎల్‌లో సిరాజ్ అద్భుత ప్రదర్శన చేసి, భవిష్యత్తు సిరీస్‌లలో టీమిండియాకు తిరిగి రాగలడా అనేది చూడాలి. రోహిత్ శర్మ సిరాజ్‌ను ఎంపిక చేయకపోవడానికి కారణాలను వివరించారు.

ఛాంపియన్స్‌ ట్రోఫీ సెలెక్షన్‌.. డైరెక్ట్‌గా రోహిత్‌ శర్మపై సిరాజ్‌ కామెంట్స్‌! ఏమన్నాడంటే..?
Rohit Siraj
Follow us on

ప్రస్తుతం క్రికెట్‌ అభిమానులంతా ఐపీఎల్‌ మూడ్‌లో ఉన్నారు. ఐపీఎల్‌ కంటే ముందు టీమిండియా ఛాంపియన్స్‌ ట్రోఫీ సాధించడంతో ఫుల్‌ ఖుషీ అయిన భారత క్రికెట్‌ అభిమానులు ఆ తర్వాత.. ఐపీఎల్‌ రాకతో ఎవరి టీమ్స్‌కు వాళ్లు సపోర్ట్స్‌గా మారిపోయారు. ఇప్పటికే అన్ని టీమ్స్‌ ఒక్కో మ్యాచ్‌ ఆడేశాయి. మంగళవారం అహ్మదాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌పై పంజాబ్‌ కింగ్స్‌ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌ తర్వాత టీమిండియా క్రికెటర్‌, గుజరాత్‌ టైటాన్స్‌ తరఫున ఆడుతున్న మొహమ్మద్‌ సిరాజ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఛాంపియన్స్‌ ట్రోఫీకి ఎంపిక కాకపోవడంపై స్పందిస్తూ.. “రోహిత్ శర్మ ఎల్లప్పుడూ జట్టుకు ఏది మంచిదో అదే చేస్తాడు. దుబాయ్‌లో ఫాస్ట్ బౌలర్లతో పెద్దగా ఉండదని అతనికి తెలుసు, అందుకే అతను జట్టులోకి స్పిన్నర్లను తీసుకొని ఛాంపియన్స్ ట్రోఫీని గెలిపించాడు.” అని మొహమ్మద్ సిరాజ్ అన్నారు. ఈ విషయంపై గతంలో కూడా ఒకసారి స్పందించిన సిరాజ్‌.. సెలెక్ట్‌ అవ్వడం తన చేతుల్లో లేదని, కేవలం బాల్‌ మాత్రమే తన చేతుల్లో ఉందని, నేను ఏదైనా చేస్తే దాంతోనే చేయాలని సిరాజ్‌ తెలిపాడు. ఇప్పుడు రోహిత్‌ శర్మను ఉద్దేశిస్తూ.. అతను తీసుకున్న నిర్ణయం సరైందే అని పేర్కొన్నాడు.

కాగా, వన్డేలో మంచి రికార్డు కలిగి ఉన్న సిరాజ్‌ను ఛాంపియన్స్‌ ట్రోఫీకి ఎంపిక చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. బుమ్రా గాయపడినా.. కూడా సిరాజ్‌ను కాకుండా, కొత్త కుర్రాడు హర్షిత్‌ రాణాను జట్టులోకి తీసుకున్నారు కానీ, సిరాజ్‌ను మాత్రం కన్సిడర్‌ చేయలేదు. దీనిపై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అప్పుడే క్లారిటీ ఇచ్చాడు. సిరాజ్‌ కొత్త బాల్‌తో అద్బుతంగా బౌలింగ్‌ చేస్తున్నా.. పాత బాల్‌తో అంతే ఎఫెక్టివ్‌గా ఉండలేకపోతున్నాడని, అందుకే అతన్ని పక్కనపెడుతున్నట్లు వెల్లడించారు. మరి సిరాజ్‌ ఈ ఐపీఎల్‌లో తన సత్తా చాటి, ఐపీఎల్‌ తర్వాత జరగబోయే సిరీస్‌ల కోసం టీమిండియాలోకి తిరిగి వస్తాడో లేదో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.