AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asia Cup 2025: నేను ముస్లిం కాబట్టి.. ఆసియా కప్‌లో పాక్‌తో మ్యాచ్‌పై షమీ షాకింగ్‌ కామెంట్స్‌!

టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ ఆసియా కప్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆమోదించితే మ్యాచ్ జరగడంలో తప్పు లేదని, పాకిస్థాన్‌తో ఆడటం విభిన్న అనుభవమని పేర్కొన్నారు. సోషల్ మీడియా ట్రోలింగ్‌ను పట్టించుకోనని, తన దేశం తరపున ఆడటంపైనే దృష్టి పెడుతున్నానని తెలిపారు.

Asia Cup 2025: నేను ముస్లిం కాబట్టి.. ఆసియా కప్‌లో పాక్‌తో మ్యాచ్‌పై షమీ షాకింగ్‌ కామెంట్స్‌!
Mohammed Shami
SN Pasha
|

Updated on: Aug 28, 2025 | 1:24 PM

Share

ఆసియా కప్‌లో భారత్ పాకిస్థాన్‌తో ఆడాలా? వద్దా అనే ప్రశ్నకు టీమిండియా స్టార్‌ పేసర్‌ మొహమ్మద్‌ షమీ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఆసియా కప్‌ 2025లో పాకిస్థాన్‌తో భారత్ ఆడటం సరైనదేనా అనే దానిపై పెద్ద చర్చ జరుగుతోన్న విషయం తెలిసిందే. అయితే, ప్రభుత్వం ఆమోదిస్తే భారత్-పాకిస్తాన్ జరగడంలో ఎలాంటి తప్పులేదని షమీ అభిప్రాయపడ్డాడు. అలాగే పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌ల తర్వాత తాను ఎదుర్కొంటున్న సోషల్ మీడియా ట్రోలింగ్‌పై కూడా షమీ స్పందించాడు.

షమీ మాట్లాడుతూ.. “నేను వివాదాలకు దూరంగా ఉంటాను. పాక్‌తో మ్యాచ్‌ గురించి ప్రభుత్వం, బీసీసీఐ నిర్ణయిస్తాయి. మేం వారి నిర్ణయాన్ని అనుసరిస్తాం” అని షమీ చెప్పాడు. ఇతర జట్లతో పోలిస్తే పాకిస్తాన్‌తో ఆడటం భిన్నంగా ఉందని షమీ పేర్కొన్నాడు. “అభిమానుల క్రేజ్ కారణంగా పాకిస్తాన్‌తో ఆడటం భిన్నంగా ఉంటుంది” అని అతను చెప్పాడు. ఇంటర్నెట్‌లో ట్రోలింగ్ గురించి మాట్లాడుతూ.. తాను ముస్లిం అయినందున కొంతమంది తనను లక్ష్యంగా చేసుకుంటారని, కానీ అతను దాని గురించి పట్టించుకోనని చెప్పాడు.

“నేను ముస్లింని కాబట్టి కొందరు నన్ను లక్ష్యంగా చేసుకుంటారు, ముఖ్యంగా పాకిస్తాన్ మ్యాచ్‌ల తర్వాత నన్ను ట్రోల్‌ చేస్తారు. నాకు అది పట్టదు. నేను యంత్రాన్ని కాదు, నాకు మంచి, చెడు రోజులు ఉంటాయి. నేను నా దేశం తరపున ఆడుతున్నప్పుడు, నేను సోషల్ మీడియా కంటే వికెట్లు, విజయాలపైనే దృష్టి పెడతాను. ట్రోలింగ్ నన్ను ప్రభావితం చేయదు ఎందుకంటే నేను దానిని కంట్రోల్‌ చేయలేను. అందుకే దాన్ని అసలు పట్టించుకోను” అని షమీ సోషల్ మీడియా ట్రోలింగ్ గురించి తెలిపాడు. కాగా ఆసియా కప్ కోసం ఎంపిక చేసిన జట్టులో షమీకి చోటు దక్కలేదు. ఐపీఎల్‌ 2025లో షమీ ఫేలవ ప్రదర్శన కనబర్చడంతో సెలెక్టర్లు అతన్ని టీ20లకు పరిగణంలోకి తీసుకోలేదు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us
మానవ శరీర భాగాలతో పూజలు చేస్తే అద్భుత శక్తులు వస్తాయని.. దారుణం
మానవ శరీర భాగాలతో పూజలు చేస్తే అద్భుత శక్తులు వస్తాయని.. దారుణం
పెళ్లైన నాలుగేళ్లకే విడాకులు.. చిన్న విషయానికే ఇంట్లో యుద్ధం
పెళ్లైన నాలుగేళ్లకే విడాకులు.. చిన్న విషయానికే ఇంట్లో యుద్ధం
ఇమ్రాన్ ఖాన్ పరిస్థితిపై రవిశాస్త్రి ఆగ్రహం
ఇమ్రాన్ ఖాన్ పరిస్థితిపై రవిశాస్త్రి ఆగ్రహం
సారీ నాన్న.. ఈ భారం నేను మోయలేకపోతున్నా..
సారీ నాన్న.. ఈ భారం నేను మోయలేకపోతున్నా..
గాఢంగా ప్రేమించాడు.. కట్ చేస్తే.. ఆ ఒక్క ఫోన్ కాల్‌తో..
గాఢంగా ప్రేమించాడు.. కట్ చేస్తే.. ఆ ఒక్క ఫోన్ కాల్‌తో..
ఆ సినిమాతో నా కెరీర్ అయిపోయిందని అన్నారు.. థియేటర్లను షేక్ చేసిన
ఆ సినిమాతో నా కెరీర్ అయిపోయిందని అన్నారు.. థియేటర్లను షేక్ చేసిన
ఆ ఒక్క హీరోతో వరుసగా మూడు సినిమాలు.. అది అంత మంచిది కాదు..
ఆ ఒక్క హీరోతో వరుసగా మూడు సినిమాలు.. అది అంత మంచిది కాదు..
గాల్లో ఉండగా బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంలో హైఅలర్ట్.. ఏంజరిగిందంటే
గాల్లో ఉండగా బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంలో హైఅలర్ట్.. ఏంజరిగిందంటే
ఫాస్టెస్ట్ సెంచరీ చేస్తా.. వైభవ్ టార్గెట్లు మామూలుగా లేవు
ఫాస్టెస్ట్ సెంచరీ చేస్తా.. వైభవ్ టార్గెట్లు మామూలుగా లేవు
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుల్లెట్ కలకలం.. ప్రయాణికుడు అదుపులోకి..
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుల్లెట్ కలకలం.. ప్రయాణికుడు అదుపులోకి..