Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: 50కే 4 వికెట్లు డౌన్.. కట్‌చేస్తే.. ఎంట్రీ ఇచ్చిన తుఫాన్ జోడీ.. 8 ఫోర్లు, 12 సిక్సులతో ఊచకోత.. వీడియో

MLC 2023: USAలోని డల్లాస్‌లో జరిగిన మేజర్ లీగ్ క్రికెట్ (MLC 2023) టోర్నమెంట్‌లో శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్ 2వ మ్యాచ్‌లో విజయం సాధించింది . ఈ మ్యాచ్‌లో యునికార్న్స్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

Video: 50కే 4 వికెట్లు డౌన్.. కట్‌చేస్తే.. ఎంట్రీ ఇచ్చిన తుఫాన్ జోడీ.. 8 ఫోర్లు, 12 సిక్సులతో ఊచకోత.. వీడియో
Mlc 2023
Follow us
Venkata Chari

|

Updated on: Jul 15, 2023 | 6:46 PM

MLC 2023: USAలోని డల్లాస్‌లో జరిగిన మేజర్ లీగ్ క్రికెట్ (MLC 2023) టోర్నమెంట్‌లో శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్ 2వ మ్యాచ్‌లో విజయం సాధించింది . ఈ మ్యాచ్‌లో యునికార్న్స్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన శాన్ ఫ్రాన్సిస్కోకు శుభారంభం లభించలేదు. ఓపెనర్లు ఫిన్ అలెన్ (10), మాథ్యూ వేడ్ (5) ఆరంభంలోనే వికెట్లు చేజార్చుకున్నారు. మూడో స్థానంలో వచ్చిన మార్కస్ స్టోయినిస్ 6 పరుగులు చేసి బౌలర్ బౌలింగ్ లో ఔటయ్యాడు. అలాగే ఆరోన్ ఫించ్ 9 పరుగులు మాత్రమే చేయగలిగాడు. 50 పరుగులు మాత్రమే చేసి 4 వికెట్లు కోల్పోయిన శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్ జట్టుకు షాదాబ్ ఖాన్, కోరీ అండర్స్ సహకరించారు.

5వ వికెట్‌కు ఈ జోడీ తుఫాన్ బ్యాటింగ్‌తో అదరగొట్టారు. ఫలితంగా ఐదో వికెట్‌కు 119 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. 30 బంతుల్లో 5 భారీ సిక్సర్లు, 4 ఫోర్లతో 61 పరుగులు చేసిన షాదాబ్ ఖాన్ ఔటయ్యాడు. అయితే, మరోవైపు తన దూకుడు కొనసాగించిన కోరీ అండర్స్.. ఎంఐ న్యూయార్క్ బౌలర్లను చిత్తు చేశాడు. 52 బంతులు ఎదుర్కొన్న అండర్సన్ 7 భారీ సిక్సర్లు, 4 ఫోర్లతో అజేయంగా 91 పరుగులు చేశాడు. ఈ అద్భుత బ్యాటింగ్‌తో శాన్‌ఫ్రాన్సిస్కో యునికార్న్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది.

ఇవి కూడా చదవండి

216 పరుగుల కఠిన లక్ష్యంతో బరిలోకి దిగిన ఎంఐ న్యూయార్క్ జట్టుకు డెవాల్డ్ బ్రెవిస్ (32) శుభారంభం అందించాడు. శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్ బౌలర్లు పవర్‌ప్లేలో విజయం సాధించడంతో స్టీవెన్ టేలర్ (0), మోనాక్ పటేల్ (8) వికెట్లు తీశారు. అయితే మిడిలార్డర్‌లో నికోలస్ పూరన్ 28 బంతుల్లో 3 సిక్సర్లు, 2 ఫోర్లతో 40 పరుగులు చేయగా, కెప్టెన్ కీరన్ పొలార్డ్ 27 బంతుల్లో 4 సిక్సర్లు 2 ఫోర్లతో 48 పరుగులు చేశాడు.

చివరి ఓవర్లలో టిమ్ డేవిడ్ 28 బంతుల్లో 4 సిక్సర్లు, 4 ఫోర్లతో అజేయంగా 53 పరుగులు చేశాడు. అయినా జట్టును విజయపథంలో నడిపించలేకపోయాడు. ఫలితంగా ఎంఐ న్యూయార్క్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసి 22 పరుగుల తేడాతో ఓడిపోయింది.

MI న్యూయార్క్ ప్లేయింగ్ 11: డెవాల్డ్ బ్రెవిస్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), హమ్మద్ అజామ్, స్టీవెన్ టేలర్, టిమ్ డేవిడ్, కీరన్ పొలార్డ్ (కెప్టెన్), మోనాక్ పటేల్, సరబ్జిత్ లడ్డా, ఎహ్సాన్ ఆదిల్, కగిసో రబాడ, ట్రెంట్ బౌల్ట్.

శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్ ప్లేయింగ్ 11: మాథ్యూ వేడ్, ఫిన్ అలెన్, ఆరోన్ ఫించ్ (కెప్టెన్), కోరీ అండర్సన్, మార్కస్ స్టోయినిస్, తజిందర్ ధిల్లాన్, చైతన్య బిష్ణోయ్, షాదాబ్ ఖాన్, కార్మి లే రౌక్స్, హారిస్ రౌఫ్, లియామ్ ప్లంకెట్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఓటములు నేర్పిన పాఠాలు.. ఆరో ప్రయత్నంలో సివిల్స్‌లో ర్యాంకు
ఓటములు నేర్పిన పాఠాలు.. ఆరో ప్రయత్నంలో సివిల్స్‌లో ర్యాంకు
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?