Mithali Raj: మిథాలీని ప్రశంసిస్తూ ప్రధాని మోదీ లేఖ.. ట్విట్టర్‌ వేదికగా ఎమోషనల్‌ పోస్ట్‌ చేసిన మాజీ క్రికెటర్‌..

|

Jul 02, 2022 | 8:33 PM

Mithali Raj: మిథాలీ రాజ్‌ ఇటీవల కఅన్ని ఫార్మట్ల ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ నుంచి రైటైరయిన విషయం తెలిసిందే. 23 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో విజయాలను టీమిండియాకు అందించింది...

Mithali Raj: మిథాలీని ప్రశంసిస్తూ ప్రధాని మోదీ లేఖ.. ట్విట్టర్‌ వేదికగా ఎమోషనల్‌ పోస్ట్‌ చేసిన మాజీ క్రికెటర్‌..
Follow us on

Mithali Raj: మిథాలీ రాజ్‌ ఇటీవల కఅన్ని ఫార్మట్ల ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ నుంచి రైటైరయిన విషయం తెలిసిందే. 23 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో విజయాలను టీమిండియాకు అందించింది. 232 వన్డేల్లో 7805 పరుగులు చేసింది. 89 టీ20 మ్యాచ్‌లు ఆడిన మిథాలీ జట్టుకు ఎన్నో విజయలను అందించింది. ఇక తన అసమాన ప్రతిభతో మహిళా క్రికెట్‌ ఖ్యాతిని పెంచిన మిథాలీపై ప్రశంసల వర్షం కురిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ సైతం మిథాలీపై ప్రశంసలు కురిపించారు.

మన్‌కీ బాత్‌లో మిథాలీ రాజీ రిటైర్‌మెంట్‌ విషయమై ప్రస్తావించిన మోదీ.. ‘మిథాలీ రాజ్‌ ఈ నెల ప్రారంభంలో తన రిటైర్మెంట్ ప్రకటించింది. ఇది చాలా మంది అభిమానులను భావోద్వేగానికి గురి చేసింది. మిథాలీ అసాధారణ క్రీడాకారిణి మాత్రమే కాదు.. ఎంతోమంది యువ ఆటగాళ్లకు స్ఫూర్తి. మిథాలీ తదుపరి భవిష్యత్తుకు నేను శుభాకాంక్షలు తెలుపుతున్నా’ అని తెలిపారు. అలాగే ప్రధాన మంత్రి మిథాలీపై ప్రశంసలు కురిపిస్తూ ఓ లేఖను కూడా పంపించారు. మహిళా క్రికెట్‌ రంగానికి మిథాలీ రాజ్‌ చేసిన కృషిని ప్రశంసిస్తూ.. ఆమె నాయకత్వ లక్షణాలను ప్రస్తావిస్తూ ఈ లేఖను విడుదల చేశారు.

తాజాగా మిథాలీ ఈ విషయాన్ని తెలుపుతూ ట్వీట్ చేసింది. ప్రధాని పంపిన లేఖను ట్వీట్ చేస్తూ.. ‘మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి ఇలాంటి ప్రోత్సాహం అందడం చాలా గౌరవం, గర్వించదగ్గ విషయం. నరేంద్ర మోదీ గారు నాతో పాటు ఎంతో మందికి రోల్‌ మోడల్‌, స్ఫూర్తి’ అని రాసుకొచ్చింది. మోదీ పంపిన లేఖను ఎప్పటికీ దాచుకుంటానని తెలిపిన మిథాలీ.. ‘నా జీవితంలో తదుపరి స్టెప్‌కు దీనిని ఒక ప్రేరణగా తీసుకుంటారు. నరేంద్ర మోదీ భారత క్రీడా రంగానికి చేస్తున్న కృషికి అనుగుణంగా పనిచేస్తానని తెలిపింది.

మిథాలీ చేసిన ట్వీట్స్‌..

ఇదిలా ఉంటే మిథాలీ చేసిన ఈ ట్వీట్‌ను పలువురు సెలబ్రిటీలు రీట్వీట్ చేశారు. బాలీవుడ్‌ హీరో అనిల్‌ కపూర్‌ మిథాలీ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ.. ‘నిజమైన స్ఫర్తిదాయకమైన వ్యక్తికి అందిన సరైన గౌరవం ఇది’ అని రాసుకొచ్చాడు. ఇక కరణ్‌ జోహర్‌.. ‘నిజంగా ఇది చాలా గౌరవం’ అని అభిప్రాయపడ్డాడు. తమిళ్‌ హీరో మాధవన్‌ మిథాలీ ట్వీట్‌ను రీట్వీట్‌ చేస్తూ.. ‘నిజంగా ఇది అద్భుతమైన ప్రోత్సాహం. నేను చాలా గర్వం ఫీలవుతున్నాను’ అని రాసుకొచ్చాడు. అనుపమ్‌ ఖేర్‌.. ‘జయ హో’ అంటూ ట్వీట్ చేశాడు. బీసీసీఐ కోశాధికారి థాకూర్‌ అరుణ్‌ కుమార్‌ మిథాలీ రాజ్‌కు శుభాకాంక్షలు తెలపడంతో పాటు, క్రీడాకారులకు అండగా నిలుస్తోన్న ప్రధానికి ధన్యవాదాలు అంటూ ట్వీట్‌ చేశాడు.

సెలబ్రిటీల ట్వీట్స్‌..

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..