IPL 2024: తొలి బంతికే ఔట్.. చెత్త రికార్డును మూట గట్టుకున్న రోహిత్ శర్మ.. ఐపీఎల్ హిస్టరీలో మొదటి ప్లేయర్‌గా..

|

Apr 01, 2024 | 10:26 PM

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన ట్రెంట్ బౌల్ట్ ముంబై జట్టుకు వరుసగా షాక్ లు ఇచ్చాడు. తొలి ఓవర్ లోనే కెప్టెన్ రోహిత్ శర్మ, నమన్ సున్నాకే ఔటయ్యారు. ఆ తర్వాత నాలుగో నంబర్‌లో ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రూపంలో వచ్చిన డెవాల్డ్‌ బ్రేవిస్‌ కూడా సున్నాకే పెవిలియన్ చేరుకున్నాడు. తద్వారా ముంబై టాప్ త్రీ బ్యాటర్లు ఖాతాలు తెరవకుండానే వెనుదిరిగారు

IPL 2024: తొలి బంతికే ఔట్.. చెత్త రికార్డును మూట గట్టుకున్న రోహిత్ శర్మ.. ఐపీఎల్ హిస్టరీలో మొదటి ప్లేయర్‌గా..
Rohit Sharma
Follow us on

ఐపీఎల్ 17వ ఎడిషన్ లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్ జట్టు ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ ఓడిపోయింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లోనూ ముంబైకి ఎదురుదెబ్బ తగిలింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన ట్రెంట్ బౌల్ట్ ముంబై జట్టుకు వరుసగా షాక్ లు ఇచ్చాడు. తొలి ఓవర్ లోనే కెప్టెన్ రోహిత్ శర్మ, నమన్ సున్నాకే ఔటయ్యారు. ఆ తర్వాత నాలుగో నంబర్‌లో ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రూపంలో వచ్చిన డెవాల్డ్‌ బ్రేవిస్‌ కూడా సున్నాకే పెవిలియన్ చేరుకున్నాడు. తద్వారా ముంబై టాప్ త్రీ బ్యాటర్లు ఖాతాలు తెరవకుండానే వెనుదిరిగారు. ఇందులో ఆ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ సున్నాకి ఔటయి ఐపీఎల్‌లో ఒక చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ తాను ఎదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యాడు. దీంతో ఐపీఎల్‌లో అత్యధిక గోల్డెన్‌ డక్‌లకు అవుటైన ఆటగాడిగా రోహిత్‌ నిలిచాడు. రోహిత్ శర్మ ఇప్పటి వరకు ఐపీఎల్‌లో 17 సార్లు గోల్డెన్ డక్‌తో ఔట్ అయ్యాడు. రోహిత్ కంటే ముందు ఆర్‌సీబీకి చెందిన దినేష్ కార్తీక్ కూడా ఐపిఎల్‌లో 17 సార్లు డకౌట్ అయ్యి రోహిత్ తో సంయుక్తంగా మొదటి స్థానంలో నిలిచాడు.

వీరిద్దరూ కాకుండా అత్యధిక సార్లు డకౌట్లు అయిన జాబితాలో నలుగురు ఆటగాళ్లు సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. వీరిలో పీయూష్ చావ్లా, మన్‌దీప్ సింగ్, గ్లెన్ మాక్స్‌వెల్, సునీల్ నరైన్ తలా 15 సార్లు డకౌట్ గా వెనుదిరిగారు.

ఇవి కూడా చదవండి

ఇరు జట్లు..

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI):

ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రోహిత్ శర్మ, నమన్ ధీర్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), టిమ్ డేవిడ్, గెరాల్డ్ కోయెట్జీ, పీయూష్ చావ్లా, ఆకాష్ మధ్వల్, జస్ప్రీత్ బుమ్రా, క్వేనా మఫాకా.

ఇంపాక్ట్ ప్లేయర్లు:

డెవాల్డ్ బ్రూయిస్, నువాన్ తుషార, రొమారియో షెపర్డ్, నెహాల్ వధేరా, షామ్స్ ములానీ.

రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI):

యశస్వి  జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (వికెట్ కీపర్/కెప్టెన్), ర్యాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హీట్‌మెయర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బోల్ట్, అవేష్ ఖాన్, నాంద్రే బర్గర్, యుజ్వేంద్ర చాహల్

ఇంపాక్ట్ ప్లేయర్లు:

రోవ్‌మన్ పావెల్, తనుష్ కొటియన్, కుల్దీప్ సేన్, శుభమ్ దూబే, అబిద్ ముస్తాక్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..