Dhoni-Rishabh Pant: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వార్మప్ మ్యాచులో భారత్, బుధవారం రెండో వార్మప్ మ్యాచులో తలపడి ఘన విజయం సాధించింది. అయితే రెండో వార్మప్ మ్యాచులో అతిధి పాత్ర పోషించిన రిషబ్ పంత్‌కు ఆస్ట్రేలియాపై ప్రాక్టీస్ మ్యాచ్‌లో విశ్రాంతి లభించింది. అయితే, సౌత్‌పా మాత్రం బౌండరీ తాడు వెలుపల రిషబ్ పంత్ నైపుణ్యాలను మెరుగుపరిచే పనిలో నిమగ్నమయ్యాడు. భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా దుబాయ్‌లో పోరాడుతున్నప్పుడు, పంత్‌కు కీపింగ్‌లో మరిన్ని చిట్కాలు నేర్పిస్తూ మెంటార్ ధోని కనిపించాడు.
ధోని అత్యుత్తమ వికెట్ కీపర్‌లలో ఒకడు కావడంతో, పంత్ ఫుల్ స్వింగ్‌లో ధోని నుంచి కీపింగ్ పాఠాలు నేర్చుకుంటూ కనిపించాడు. అయితే ఈ వీడియో నెట్టింట్లో షేర్ చేయడతో నెటిజన్లు తెగ వైరల్ చేశారు. అలాగే తమ అభిప్రాయాలను పంచుకున్నారు. వారసుడికి కీపింగ్‌లో తగిన నైపుణ్యాలు నేర్పిస్తుండడంతో అభిమానులు కూడా సంతోషంలో మునిగిపోయారు.
ఎంఎస్ ధోని తన వారసుడు రిషబ్ పంత్‌ని తీర్చిదిద్దుతున్నాడంటూ కామెంట్లు పంచుకున్నారు. 2017 లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన పంత్.. ఫార్మాట్‌లు, షరతులతో సంబంధం లేకుండా పెద్ద షాట్‌లను ఆడటం పలు విమర్శలకు దారి తీసింది. అయితే కొన్నిసార్లు ఇదే ఆటతో మ్యాచులను గెలిపించిన తీరు కూడా అభినందనీయం. భారత మాజీ కెప్టెన్ కూడా 24 ఏళ్ల పంత్.. మరింతగా రాణించాలని కోరుకుంటున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది.
శిక్షణ డ్రిల్ గురించి మాట్లాడితే, ధోనీ అండర్ ఆర్మ్ బంతులు విసురుతున్నట్లు కనిపించగా, పంత్ వాటిని ముందు ఒక స్టంప్‌తో పట్టుకుంటూ కనిపించాడు. యూఏఈలో నెమ్మదిగా, మలుపు తిరిగే ట్రాక్‌లలో స్పిన్నర్‌లపై పంత్ తన నైపుణ్యాలను పదునుపెట్టడానికే ఈ పాఠాలు చెప్పినట్లు తెలుస్తోంది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఆస్ట్రేలియా టీం నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 152 పరుగులు సాధించింది. స్టీవ్ స్మిత్ 57 పరుగులతో రాణించాడు. స్టోయినిస్ 41 పరుగులతో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. మ్యాక్స్‌వెల్ 37 పరుగులు చేయగా, భారత బౌలర్లలో అశ్విన్ 2, రాహుల్ చహర్, భువీ, జడేజా తలో వికెట్ పడగొట్టారు. 153 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన భారత్ 13 బంతులు మిగిలుండగానే చేరుకుంది. ఓపెనర్ రోహిత్ శర్మ 60 పరుగులు సాధించిన తరువాత రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. సూర్యకుమార్ యాదవ్ 38, కేఎల్ రాహుల్ 39 పరుగులతో ఆకట్టుకున్నారు. హార్దిక్ పాండ్యా భారత విజయానికి ఆరు పరుగులు కావాల్సిన తరుణంలో భారీ సిక్స్ కొట్టి తన స్టైల్లో మ్యాచును ముగించాడు.
Mentor on duty ?? #dhoni #pant #T20WorldCup https://t.co/13Z1JJTnXl
— Proffesor ? (@vetrirockzz) October 20, 2021
KeeKeeping Drills for Pant on the sidelines with the Mentor, Dhoni ! #IndvAus #T20WorldCup pic.twitter.com/ZpiwsFekqv
— Cricket Page (@CricketPage3) October 20, 2021
Rishabh Pant practicing with MS Dhoni. pic.twitter.com/mwXAvaUaoz
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 20, 2021
MS Dhoni helping Rishabh Pant do something he did very rarely during his own playing career, practicing his wicket-keeping #T20WorldCup pic.twitter.com/ghPh3cPggz
— Bharat Sundaresan (@beastieboy07) October 20, 2021
Years pass.. but the love for this man remains the same. @msdhoni ❤️#Dhoni #Pant #TeamIndia #T20WorldCup pic.twitter.com/OnCkdk0bhQ
— Meme Lord (@Dark_Loord_) October 20, 2021
Dhoni and Pant ? pic.twitter.com/YWxXqNHirJ
— Sunaina Gosh (@Sunainagosh7) October 20, 2021
Also Read: T20 World Cup 2021: ఫేవరేట్లుగా భారత్, ఇంగ్లండ్, పాకిస్తాన్ టీంలు.. ఎవరి అవకాశాలు ఎలా ఉన్నాయంటే..?