‘అసమర్థుడు’ అంటూ జట్టు నుంచి తప్పించారు.. కట్‌చేస్తే.. 5 సిక్సులు, 12 ఫోర్లతో తుఫాన్ సెంచరీ.. దిమ్మతిరిగే షాక్

పాకిస్థాన్ సూపర్ లీగ్ 2023 ఆరో మ్యాచ్‌లో మార్టిన్ గప్టిల్ చెలరేగిపోయాడు. ఈ న్యూజిలాండ్ ఓపెనర్ కేవలం 67 బంతుల్లో 117 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. గప్టిల్ తన తుఫాను ఇన్నింగ్స్‌లో 5 సిక్సర్లు, 12 ఫోర్లు కొట్టాడు.

అసమర్థుడు అంటూ జట్టు నుంచి తప్పించారు.. కట్‌చేస్తే.. 5 సిక్సులు, 12 ఫోర్లతో తుఫాన్ సెంచరీ.. దిమ్మతిరిగే షాక్
Martin Guptill Psl

Updated on: Feb 19, 2023 | 5:10 AM

పాకిస్థాన్ సూపర్ లీగ్ 2023 ఆరో మ్యాచ్‌లో మార్టిన్ గప్టిల్ చెలరేగిపోయాడు. ఈ న్యూజిలాండ్ ఓపెనర్ కేవలం 67 బంతుల్లో 117 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. గప్టిల్ తన తుఫాను ఇన్నింగ్స్‌లో 5 సిక్సర్లు, 12 ఫోర్లు కొట్టాడు. గప్టిల్ స్ట్రైక్ రేట్ 174.63గా నిలిచింది. గప్టిల్ ఈ ఇన్నింగ్స్ ఆడినా, క్వెట్టా గ్లాడియేటర్స్ జట్టు 20 ఓవర్లలో 168 పరుగులు మాత్రమే చేయగలిగింది. మిగతా 6గురు బ్యాట్స్‌మెన్స్ 55 బంతుల్లో 45 పరుగులు మాత్రమే జోడించగలిగారు. గప్టిల్ మాత్రమే ఒక ఎండ్ నుంచి పరుగుల వర్షం కురిపిస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో టీ20 క్రికెట్‌లో తన ఐదవ సెంచరీని సాధించాడు.

మార్టిన్‌ గప్టిల్‌ సెంచరీ చేసేందుకు బీజం పడింది మాత్రం 19వ ఓవర్లోనే. ఈ ఓవర్‌లో 30 పరుగులు పిండేశాడు. ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ ఆండ్రూ టై 6 బంతుల్లో 3 సిక్సర్లు, 3 ఫోర్లు కొట్టాడు. అదే ఓవర్లో వేగంగా బ్యాటింగ్ చేయడంతో సెంచరీకి చేరాడు.

మార్టిన్ గప్టిల్ అద్భుతమైన ఇన్నింగ్స్..

టాస్ గెలిచిన తర్వాత కరాచీ కింగ్స్ క్వెట్టా గ్లాడియేటర్స్‌ను ముందుగా బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. రెండో బంతికే ఓపెనర్ జాసన్ రాయ్ బౌల్డ్ అయ్యాడు. ఖాతా కూడా తెరవలేకపోయాడు. ఆ తర్వాత అబ్దుల్ బెంగాల్జీ కూడా ఖాతా తెరవలేకపోయాడు. ఉమర్ అక్మల్ 4 పరుగులు చేశాడు. కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ 11 బంతుల్లో 5 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇఫ్తికార్ అహ్మద్ ఖచ్చితంగా గప్టిల్‌తో భాగస్వామ్యాన్ని పంచుకున్నాడు. కరాచీ జట్టు 150 దాటింది. మరోవైపు గప్టిల్ జాగ్రత్తగా బ్యాటింగ్ కొనసాగించాడు. ఆశ్చర్యకరంగా, మార్టిన్ గప్టిల్ 44 బంతుల్లో తన అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. అయితే దీని తర్వాత, ఈ ఆటగాడు తదుపరి 18 బంతుల్లో సెంచరీ చేశాడు. గప్టిల్ 62 బంతుల్లో సెంచరీ సాధించాడు.

ఇవి కూడా చదవండి

3 ఫోర్లు, 3 సిక్సులతో 30 పరుగులు..

గప్టిల్ ఆది నుంచి పరుగులు చేయడంలో ఇబ్బంది పడ్డాడు. కానీ, 19వ ఓవర్‌లో అతను ఆండ్రూ టై బౌలింగ్‌లో దుమ్మురేపాడు. టై విసిరిన ఈ ఓవర్లో ఓవర్‌లో గప్టిల్ 3 సిక్స్‌లు, 3 ఫోర్ల ఆధారంగా 30 పరుగులు చేశాడు.

న్యూజిలాండ్ జట్టు నుంచి మార్టిన్ గప్టిల్ ఔట్..

మార్టిన్ గప్టిల్ 12 అక్టోబర్ 2022 నుండి న్యూజిలాండ్ తరపున టీ20 మ్యాచ్‌లు ఆడలేదు. ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో కూడా గప్టిల్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. గప్టిల్ అంతర్జాతీయ కెరీర్ ఇప్పుడు ముగిసిందని భావించారు. కానీ, PSLలో ఆడిన ఈ ఇన్నింగ్స్ ఆధారంగా, అతనిలో ఇంకా చాలా క్రికెట్ మిగిలి ఉందని అతను నిరూపించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..