Bronco Test : రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడానికే ఈ టెస్ట్.. మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు!

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇటీవల క్రికెటర్ల ఫిట్‌నెస్ కోసం బ్రోంకో టెస్ట్ అనే కొత్త పద్ధతిని ప్రవేశపెట్టింది. ముఖ్యంగా గాయాలతో బాధపడుతున్న ఫాస్ట్ బౌలర్ల కోసం ఈ కొత్త ఫిట్‌నెస్ టెస్ట్‌ను తీసుకొచ్చారు. అయితే, దీనిపై భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ ఆశ్చర్యపరిచే వ్యాఖ్యలు చేశారు.

Bronco Test : రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడానికే ఈ టెస్ట్.. మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు!
Rohit Sharma

Updated on: Aug 25, 2025 | 8:46 PM

Bronco Test : భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఇటీవల ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ను పరీక్షించడానికి బ్రోంకో టెస్ట్ (Bronco Test) అనే కొత్త పద్ధతిని ప్రారంభించింది. ఈ కొత్త పరీక్ష పద్ధతి ముఖ్యంగా ఫిట్‌నెస్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఫాస్ట్ బౌలర్ల కోసం తీసుకువచ్చింది. ఆటగాళ్ల ఫిట్‌నెస్, స్టామినాను మెరుగుపరచడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. అయితే, ఈ కొత్త టెస్ట్ విధానం పై మాజీ భారత క్రికెటర్ మనోజ్ తివారీ ఒక సంచలన వ్యాఖ్య చేశారు. ఈ టెస్ట్ రోహిత్ శర్మను వన్డే క్రికెట్ నుంచి రిటైర్ అయ్యేలా చేయడానికే తీసుకువచ్చారని ఆయన అభిప్రాయపడ్డారు.

క్రిక్ ట్రాకర్‎తో మాట్లాడిన మనోజ్ తివారీ.. “అందరూ రోహిత్ శర్మను అత్యంత ఫిట్ క్రికెటర్లలో ఒకరిగా భావించరు, కానీ అతని ప్రదర్శన కారణంగా అతన్ని ఎవరూ బెంచ్‌పై కూర్చోబెట్టలేరు . విరాట్ కోహ్లిని 2027 వన్డే వరల్డ్ కప్ ప్లాన్‌ నుంచి తప్పించడం కష్టం అని నేను అనుకుంటున్నాను. అయితే, రోహిత్ శర్మను వరల్డ్ కప్ ప్లాన్‌లో ఉంచుతారని నేను అనుకోవడం లేదు. భారత క్రికెట్‌లో జరుగుతున్న విషయాలను నేను చాలా దగ్గరగా గమనిస్తున్నాను. కొన్ని రోజుల క్రితం తీసుకువచ్చిన ఈ బ్రోంకో టెస్ట్, రోహిత్ శర్మ లేదా అతని లాంటి ఆటగాళ్లు తమ కెరీర్‌ను కొనసాగించకుండా చూడాలనే ఉద్దేశ్యంతోనే తీసుకువచ్చారని నేను భావిస్తున్నాను. రోహిత్ భవిష్యత్తులో జట్టులో ఉండకూడదని ఎవరో కోరుకుంటున్నారు. అందుకే బ్రోంకో టెస్ట్ తీసుకువచ్చారు” అని అన్నారు.

మనోజ్ తివారీ బ్రోంకో టెస్ట్‌ను ఎవరు తీసుకువచ్చారో తనకు తెలియదని చెప్పారు. తన అభిప్రాయం ప్రకారం.. రోహిత్ శర్మ ఈ ఫిట్‌నెస్ టెస్ట్‌లో పాస్ కావడం చాలా కష్టం అని అన్నారు.

ఏమిటి ఈ బ్రోంకో టెస్ట్?

కొన్ని రోజులుగా బ్రోంకో టెస్ట్ అనే పదం బాగా వినిపిస్తోంది. ఇంతకీ ఈ బ్రోంకో టెస్ట్ అంటే ఏమిటి? బ్రోంకో టెస్ట్ అనేది పరిగెత్తడం ఆధారంగా ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ను పరీక్షిస్తుంది. ఇది ఆటగాళ్ల స్టామినా, మానసిక బలం, హార్ట్ బీట్ ను కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది.

ఈ టెస్ట్‌లో 20 మీటర్లు, 40 మీటర్లు, 60 మీటర్ల శతల్ రన్‌లు ఉంటాయి. ఆటగాళ్లకు దీని మధ్య ఎలాంటి విరామం ఉండదు. ఇది యో-యో టెస్ట్‌కు భిన్నంగా ఉంటుంది. ఈ టెస్ట్‌లో ఆటగాళ్లు మొత్తం 1200 మీటర్ల దూరాన్ని 6 నిమిషాల్లో పూర్తి చేయాలి.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..