ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2022లో పలు సంచలనాలు చోటు చేసుకున్నాయి . ఆదివారం కూడా పెను సంచలనం నమోదైంది. అడిలైడ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై పసికూన నెదర్లాండ్స్ ఘన విజయం సాధించింది. దీంతో సెమీఫైనల్‌కు చేరుకోవాలన్న దక్షిణాఫ్రికా కలలు కూలిపోయాయి. అయితే ఈ మ్యాచ్‌లో స్టాండ్స్‌లో ఉన్న ఓ వ్యక్తి అందరి దృష్టిని ఆకర్షించాడు. అది కూడా తన ఫీల్డింగ్‌తో. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్ సాగుతుందగా స్టాండ్‌లో ఉన్నో ఓ ప్రేక్షకుడు అద్భుత క్యాచ్ అందుకున్నాడు. సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ వాన్ పార్నెల్ వేసిన చివరి ఓవర్ మూడో బంతిని హాలండ్ బ్యాటర్ అకర్‌మన్ ఫ్లిక్ చేసి నేరుగా స్టాండ్స్‌లోకి పంపించాడు. అయితే అదే సమయంలో అక్కడ నిలబడిన ఓ వ్యక్తి ఒంటి చేత్తో బంతిని క్యాచ్ పట్టుకున్నాడు. దీంతో మైదానంలో ఉన్న ప్లేయర్లు, కామెంటేటర్లతో సహా అందరూ ఆశ్చర్యపోయారు.
కాగా’క్యాచ్ ఆఫ్ ది టోర్నమెంట్’ అని ప్రశంసిస్తూ ICC కూడా దీనికి సంబంధించిన వీడియోను తమ అధికారిక ట్విట్టర్‌లో షేర్ చేసింది. టీ20 వరల్డ్ కప్ 2022 అత్యుత్తమ క్యాచ్‌లలో ఒకటి అని క్యాప్షన్ ఇస్తూ షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఆ వీడియోను చూసిన క్రికెట్ అభిమానులు ‘అతను గ్లవ్స్ లేని బేస్ బాల్ ప్లేయర్ కావచ్చు’ అని కామెంట్లు చేస్తున్నారు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా ఓడిపోతుందని ఎవరూ ఊహించలేదు. అయితే నెదర్లాండ్స్ వారిని ఓడించి మరోసారి సౌతాఫ్రికా నుదిట చోకర్స్ అని ముద్రవేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ నాలుగు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఆపై సౌతాఫ్రికా జట్టు అన్ని ఓవర్లు ఆడి ఎనిమిది వికెట్ల నష్టానికి 145 పరుగులు మాత్రమే చేయగలిగింది. నెదర్లాండ్స్ తరఫున అకెర్‌మన్ 26 బంతుల్లో అజేయంగా 41 పరుగులు చేశాడు . అతని ఇన్నింగ్స్‌లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. టామ్ కూపర్ 19 బంతుల్లో 35 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికా తరఫున రిలే రస్సో అత్యధిక స్కోరు చేశాడు. అతను 25 పరుగులు చేశాడు. కెప్టెన్ టెంబా బావుమా 20 బంతుల్లో 20 పరుగులు చేశాడు. హెన్రిచ్ క్లాసెన్ 21 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..