MS Dhoni: అభిమాని కోరిక నేరవేర్చిన మహేంద్ర సింగ్ ధోనీ..!

|

Jul 04, 2021 | 11:15 PM

టీమిండియా మాజీ సారథి ధోనీ అంతర్జాతీ క్రికెట్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. 16 ఏళ్లుగా టీమిండియాకు తన సేవలు అందించిన ఈ మిస్టర్ కూల్.. తాజాగా తన ఫాం హౌస్ లో సేదతీరుతూ, ఫ్యామిలితో ఎంజాయ్ చేస్తున్నాడు.

MS Dhoni: అభిమాని కోరిక నేరవేర్చిన మహేంద్ర సింగ్ ధోనీ..!
Ms Dhoni
Follow us on

MS Dhoni: టీమిండియా మాజీ సారథి ధోనీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. 16 ఏళ్లుగా టీమిండియాకు తన సేవలు అందించిన ఈ మిస్టర్ కూల్.. తాజాగా తన ఫాం హౌస్ లో సేదతీరుతూ, ఫ్యామిలితో ఎంజాయ్ చేస్తున్నాడు. అయినా ధోనీకి ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. అప్పుడప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. తాజాగా ఓ అభిమాని 13ఏళ్ల కలను నిజం చేసి ఔరా అనిపించాడు. వివరాల్లోకి వెళ్తే.. ధోనీ ప్రస్తుతం కుటుంబంతో హిమాచల్‌ ప్రదేశ్‌లో విహార యాత్రకు వెళ్లిన సంగతి తెలిసిందే. రత్నారి అనే ప్రాంతంలో ఉన్న ధోనీ.. మీనాబాగ్‌ అనే హోటల్లో ఉంటున్నాడు. అక్కడ పనిచేస్తున్న హోటల్‌ సిబ్బందిని కలిసిన ఈ మిస్టర్ కూల్.. కాసేపు సంతోషంగా మాట్లాడాడంట. ఈమేరకు మీనాబాగ్‌ హోటల్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో ఈ విషయాన్ని పోస్ట్ చేసింది.

‘మహేద్రసింగ్ ధోనీకి సేవలు చేసేందుకు దేవ్‌ అనే మా ఎంప్లాయి ఒకరు సిమ్లాలోని మీనాబాగ్‌ హోటల్ నుంచి ఇక్కడకు ట్రాన్స్‌ఫర్‌ చేయించుకున్నాడు. 2008లో ధోనీ ఒకసారి క్రికెట్‌ టోర్నీలో భాగంగా ఇక్కడకు వచ్చాడు. ఆ విషయం తెలుసుకున్న దేవ్.. ధోనీని కలవాలని చాలా ప్రయత్నించాడు. కానీ, కుదరలేదు.. పోలీసులతో దెబ్బలు తిన్నాడు. ప్రస్తుతం తనకిష్టమైన ధోనీని కలిసేందుకు సిమ్లా నుంచి ఇక్కడికి మరలా ట్రాన్స్ ఫర్ చేయించుకున్నాడు. ఎట్టకేలకు టీమిండియా మాజీ కెప్టెన్ ను కలిశాడు. తన ఫోన్‌ కవర్‌పై ఆటోగ్రాఫ్‌ కూడా తీసుకున్నాడు’ అని పోస్టులో రాసుకొచ్చింది.

నేడు (ఆదివారం) ఈ మిస్టర్ కూల్ ధోనీ, సాక్షిల 11వ వివాహ వార్షికోత్సవం. ఈ సందర్భంగా మహీ.. తన భార్య సాక్షికి ఓ వింటేజ్ కారును బహుమతిగా అందిచాడు. దీనిని సాక్షి తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. అలాగే మరెందరో వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. కామెంట్లు చేశారు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ టీమ్‌ ట్విటర్‌లో ‘మా రాజు, రాణికి సూపర్‌ హ్యాపీ యానివర్సరీ’ అంటూ ఓ ఫొటోను పంచుకుంది.

Also Read:

Carlos Brathwaite: వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ కి కరోనా పాజిటివ్..!

TeamIndia: కెప్టెన్ ను మార్చాలా.. వద్దా.. అనేది పొట్టి ప్రపంచ కప్ నిర్ణయిస్తుంది: మాజీ క్రికెటర్ దీప్ దాస్ గుప్తా