Mahendra Singh Dhoni : పాకిస్తాన్ మాజీ ఆటగాడు డానిష్ కనేరియా భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కెరీర్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. భవిష్యత్తులో ఎంఎస్ ధోని కామెంటరీ కంటే కోచింగ్‌ను ఇష్టపడతాడని చెప్పాడు. కనేరియా ఇలా ఎందుకు అన్నాడో మాత్రం చెప్పలేదు. తన యూట్యూబ్ ఛానెల్‌లో ధోని రెండో ఇన్నింగ్స్ గురించి కామెంట్స్ చేశాడు. కనేరియా మాట్లాడుతూ “ఎంఎస్ ధోని వ్యాఖ్యానం కంటే కోచింగ్‌కు ప్రాధాన్యత ఇస్తారని నా అభిప్రాయం. ధోని త్వరలో కోచింగ్ ప్రపంచంలోకి ప్రవేశించి కొత్త వృత్తిని ప్రారంభిస్తారని నేను ఖచ్చితంగా భావిస్తున్నాను. ” అన్నాడు. భారత జట్టు 2006 లో పాకిస్తాన్ పర్యటనకు వెళ్ళినప్పుడు కనేరియా ఓవర్లో ధోని సిక్సర్ కొట్టడమే కాకుండా చాలా పరుగులు చేశాడు.
ఎంఎస్ ధోని 2020 ఆగస్టులో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన సంగతి తెలిసిందే. 2019 ప్రపంచ కప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్‌లో అతను చివరిసారిగా భారత్ తరఫున ఆడాడు. ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. అయినప్పటికీ ధోని ఐపీఎల్‌లో ఆడుతున్నాడు. ఐపీఎల్ 2021లో అతని సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ అద్భుతంగా ప్రదర్శన ఇచ్చింది. కానీ కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా ఐపిఎల్‌ను వాయిదా వేయాల్సి వచ్చింది. చాలా చర్చల తరువాత సెప్టెంబరులో ఐపిఎల్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) లో ప్రారంభమవుతుంది.
నాలుగు ప్లే-ఆఫ్‌లతో సహా మిగిలిన 31 మ్యాచ్‌లు ఆడతారు. ఐపిఎల్ 2021 సీజన్ ముగిసిన తర్వాత యుఎఇలోనే టి 20 ప్రపంచ కప్ ప్రారంభమవుతుంది. ఐపీఎల్‌లో ధోని ప్రస్తుతం చాలా ఫిట్‌గా కనిపిస్తున్నాడు. తన జట్టును బాగా నిర్వహిస్తున్నాడు. 2020 ఐపిఎల్ చెన్నైకి మంచిది కానప్పటికీ ఐపిఎల్ 2021 సీజన్లో ఇది గొప్ప పున ప్రవేశం చేసింది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి పదవీ విరమణ చేసిన తరువాత ధోని ఐపిఎల్ లో మాత్రమే ఆడుతున్నాడు. ఇటీవల ధోని తన 40 పుట్టినరోజు జరుపుకున్నాడు.