Video: అదృష్టం అంటే నీదే భయ్యా..! డేంజరస్ బంతికి క్లీన్‌బౌల్డ్.. కట్‌చేస్తే.. ట్విస్ట్ చూస్తే అదిరిపోద్దంతే..!

Bizarre Dismissal: ఐసీసీ క్రికెట్ నిబంధనల ప్రకారం బ్యాట్స్ మెన్ ఔట్ కావాలంటే బంతి స్టంప్స్‌ను తాకినప్పుడు బెయిల్స్ కింద పడాలి. అయితే, తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో, బంతి వేగంగా వచ్చి వికెట్లను తాకినప్పటికీ బెయిల్స్ మాత్రం కింద పడలేదు. దీంతో ఆ బ్యాటర్ ను అత్యంత అదృష్టవంతుడంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వింతను చూసి బౌలర్, కెప్టెన్, అంపైర్లు నోరెళ్లబెట్టారు.

Video: అదృష్టం అంటే నీదే భయ్యా..! డేంజరస్ బంతికి క్లీన్‌బౌల్డ్.. కట్‌చేస్తే.. ట్విస్ట్ చూస్తే అదిరిపోద్దంతే..!
Cricket Bizarre Dismissal Video

Updated on: Jan 28, 2026 | 7:20 AM

Viral Cricket Video: అదృష్టం అంటే ఇతనిదే అనాల్సిందే..! ఈ వీడియో చూస్తే కచ్చితంగా అందరూ అనే మాట ఇదే. క్రికెట్‌లో బౌలర్ బ్యాటర్‌ను బోల్తా కొట్టించి బంతిని నేరుగా వికెట్లను ఢీ కొడితే క్లీన్ బౌల్డ్ అంటుంటాం. కానీ, ఇక్కడే సీన్ రివర్స్ అయింది. బౌలర్ డేంజరస్ డెలివరీతో బ్యాటర్‌కు షాక్ ఇచ్చాడు. బంతి కూడా నేరుగా వెళ్లి స్టంప్స్‌ను బలంగా తాకింది. ఆ శబ్దానికి బ్యాటర్ తల దించుకుని పెవిలియన్ వైపు వెళ్లడానికి సిద్ధమయ్యాడు. కానీ, అక్కడే అసలైన ట్విస్ట్ చోటుచేసుకుంది.

బెయిల్స్ పడలే – షాకైన అంపైర్లు..

బంతి వికెట్లను బలంగా తాకినప్పటికీ, పైన ఉండే బెయిల్స్ మాత్రం కదలలేదు, కింద పడలేదు. వికెట్ మాత్రం కదిలింది. ఐసీసీ రూల్స్ ప్రకారం బెయిల్స్ పూర్తిగా విడిపోయి కింద పడితేనే ఔట్ గా పరిగణిస్తుంది. ఇక్కడ వికెట్లు కదిలినా బెయిల్స్ స్థిరంగా ఉండటంతో అంపైర్లు దానిని ‘నాటౌట్’గా ప్రకటించి షాక్ అయ్యారు. ఈ సంఘటన చూసి బౌలర్ పిచ్చెక్కిపోయాడు. ఫీల్డింగ్ కెప్టెన్ అంపైర్‌తో చర్చించినా ఫలితం లేకపోయింది.

వైరల్ వీడియో..

రిచ్ కెటిల్ అనే యూజర్ ట్విట్టర్ (X) లో షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. ఈ వీడియోలో బౌలర్ ఆవేదన, కెప్టెన్ అసహనం స్పష్టంగా కనిపిస్తున్నాయి. నెటిజన్లు దీనిని “Luckiest Batter of All Time” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు “ఇది అదృష్టం కాదు, వికెట్లు, బెయిల్స్ మధ్య ఉన్న ఏదో లోపం” అని అభిప్రాయపడుతున్నారు.

జింగర్ బెయిల్స్ ఎఫెక్ట్..?

సాధారణంగా ఈ మధ్య కాలంలో ఉపయోగిస్తున్న జింగర్ బెయిల్స్ (Zinger Bails) బరువుగా ఉండటం వల్ల ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. గతంలో ఐపీఎల్, అంతర్జాతీయ మ్యాచుల్లో కూడా బంతి వికెట్లను తాకినా లైట్లు వెలిగి బెయిల్స్ కింద పడని సందర్భాలు ఉన్నాయి. ఏది ఏమైనా, ఆ బ్యాటర్ మాత్రం తన కెరీర్‌లో ఈ రోజును మర్చిపోలేడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..