MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్‌పై ఊహాగానాలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌కి ఇదే చివరి ఐపీఎల్ కావచ్చని భావిస్తున్నారు. అయితే దీనిపై ధోనీ ఇప్పుడు తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. రిటైర్మెంట్ గురించి తాను ఏమనుకుంటున్నాడో ఎట్టకేలకు ఎట్టకేలకు వెల్లడించాడు. బుధవారం లక్నో సూపర్ జెయింట్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్‌పై ధోనీ మాట్లాడుతూ.. కీలక విషయాలు వెల్లడించాడు. ఇదే తన చివరి ఐపీఎల్ అని ఇంకా నిర్ణయించుకోలేదని ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ అందించాడు.
టాస్ సమయంలో డానీ మారిసన్ ఇదే చివరి ఐపీఎల్ అని ధోనిని అడిగాడు.. దీనిపై సమాధానమిస్తూ.. కాదంటూ చెప్పేశాడు. ధోని ఐపీఎల్ ప్రారంభం నుంచి అంటే 2008 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు. గత కొన్ని సీజన్లుగా, అతని రిటైర్మెంట్ గురించి నిరంతరం ఊహాగానాలు వస్తున్నాయి.
ధోని 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరయ్యాడు. కానీ అతను నిరంతరం ఐపీఎల్ ఆడుతున్నాడు. 2020 సంవత్సరంలో కూడా, ఐపీఎల్‌లో టాస్ సమయంలో ధోని రిటైర్మెంట్ గురించి ప్రశ్నించగా, ధోనీ అస్సలు కాదంటూ చెప్పుకొచ్చాడు. అతను ఆ తర్వాత కూడా IPL ఆడాడు. 2021లో జట్టుకు నాల్గవ IPLని గెలిపించాడు. ఈసారి కూడా ధోనీ అదే పని చేశాడు. ధోని తదుపరి సీజన్‌లో కూడా కనిపించవచ్చని దీన్ని బట్టి ఊహించవచ్చు.
? Toss Update ?@ChennaiIPL win the toss and elect to field first against @LucknowIPL.
Follow the match ▶️ https://t.co/QwaagO40CB #TATAIPL | #LSGvCSK pic.twitter.com/pQC9m9fns4
— IndianPremierLeague (@IPL) May 3, 2023
ధోనీ గత సీజన్‌లో తన రిటైర్మెంట్ గురించి కూడా చెన్నై అభిమానుల ముందు వీడ్కోలు చెప్పకపోతే అది అభిమానులకు సరైనది కాదంటూ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత ఈ ఏడాది కూడా మైదానంలోకి వచ్చాడు. రిటైర్‌మెంట్‌పై ధోనీ మళ్లీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని దీనిని బట్టి తెలుస్తోంది. అంటే వచ్చే ఏడాది ఐపీఎల్‌లో కూడా కనిపించవచ్చు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..