IPL 2026 : ఐపీఎల్ కోసం అదిరిపోయే ప్లాన్.. సౌతాఫ్రికాకు భారత బౌలర్లను పంపిస్తున్న LSG!

IPL 2026 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్-19 ప్రారంభం కావడానికి ఇంకా మూడు నెలల సమయం ఉంది. అయితే, లక్నో సూపర్ జెయింట్స్ (LSG) ఫ్రాంచైజీ మాత్రం ఇప్పటికే తమ సన్నాహాలను మొదలుపెట్టింది. ఈ సన్నాహకాల కోసం LSG సౌతాఫ్రికా టీ20 లీగ్ (SA20) వేదికను ఉపయోగించుకోవాలని నిర్ణయించుకుంది.

IPL 2026 : ఐపీఎల్ కోసం అదిరిపోయే ప్లాన్.. సౌతాఫ్రికాకు భారత బౌలర్లను పంపిస్తున్న LSG!
Lsg Pre Ipl Preparation

Updated on: Dec 23, 2025 | 12:10 PM

IPL 2026 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్-19 ప్రారంభం కావడానికి ఇంకా మూడు నెలల సమయం ఉంది. అయితే, లక్నో సూపర్ జెయింట్స్ (LSG) ఫ్రాంచైజీ మాత్రం ఇప్పటికే తమ సన్నాహాలను మొదలుపెట్టింది. ఈ సన్నాహకాల కోసం LSG సౌతాఫ్రికా టీ20 లీగ్ (SA20) వేదికను ఉపయోగించుకోవాలని నిర్ణయించుకుంది. SA20 లీగ్‌లో LSG ఫ్రాంచైజీకి చెందిన డర్బన్ సూపర్ జెయింట్స్ జట్టు ఆడుతోంది.

లక్నో సూపర్ జెయింట్స్ జట్టులోని భారతీయ బౌలర్లను డర్బన్ సూపర్ జెయింట్స్ జట్టు శిక్షణా కార్యక్రమాలలో ఉపయోగించుకోవాలని LSG ప్లాన్ చేసింది. ఇందుకు సంబంధించి LSG ఇప్పటికే బీసీసీఐ నుంచి ప్రత్యేక అనుమతి పొందినట్లు వార్తలు వచ్చాయి. బీసీసీఐ కూడా భారతీయ బౌలర్లను SA20 లీగ్‌కు పంపడానికి అంగీకారం తెలిపింది.

LSG జట్టులోని ఫాస్ట్ బౌలర్లు అయిన ఆవేశ్ ఖాన్, నమన్ తివారీ, మొహ్సిన్ ఖాన్ సహా మరికొంతమంది ఆటగాళ్లను సౌతాఫ్రికాకు పంపుతుంది. ఈ ఆటగాళ్లు డర్బన్ సూపర్ జెయింట్స్ జట్టుతో కలిసి ప్రాక్టీస్ చేస్తారు. డర్బన్ సూపర్ జెయింట్స్ జట్టు నెట్స్‌లో వీరు ముఖ్య బౌలర్లుగా తీవ్రంగా శ్రమించి, రాబోయే ఐపీఎల్ సీజన్ కోసం తమను తాము సన్నద్ధం చేసుకుంటారు.

ఐపీఎల్ సీజన్-19 మినీ వేలానికి ముందు లక్నో సూపర్ జెయింట్స్ 19 మంది ఆటగాళ్లను నిలుపుకుంది. వేలంలో మరో ఆరుగురు ఆటగాళ్లను కొనుగోలు చేసింది. ఈ ఏడాది జట్టులోకి వచ్చిన కొత్త ఆటగాళ్లలో శ్రీలంకకు చెందిన స్పిన్నర్ వనిందు హసరంగా, సౌతాఫ్రికా పేసర్ అన్రిక్ నోకియా, ఆస్ట్రేలియాకు చెందిన వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ జోష్ ఇంగ్లిస్ ఉన్నారు. భారత ఆటగాళ్లలో ముకుల్ చౌధరి, అక్షత్ రఘువంశీ, నమన్ తివారీ ఉన్నారు.

లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టు : రిషబ్ పంత్ (కెప్టెన్), మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, మయాంక్ యాదవ్, అబ్దుల్ సమద్, ఆయుష్ బదోని, నికోలస్ పూరన్, షాబాజ్ అహ్మద్, ఆవేశ్ ఖాన్, మొహ్సిన్ ఖాన్, మొహమ్మద్ షమీ, అర్జున్ టెండూల్కర్, జోష్ ఇంగ్లిస్, ముకుల్ చౌదరి, వనిందు హసరంగా, అన్రిక్ నోకియా, నమన్ తివారీ.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..