మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో అరెస్ట్.. 4 ఏళ్ల జైలు శిక్షతోపాటు 5 ఏళ్ల నిషేధం.. ఎవరంటే..?

LPL Match Fixing: లంక ప్రీమియర్ లీగ్‌లో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు తేలిన తమీమ్ రెహమాన్‌కు నాలుగు సంవత్సరాల జైలు శిక్షతోపాటు ఐదు సంవత్సరాల నిషేధం, 25 మిలియన్ శ్రీలంక రూపాయల జరిమానా కూడా విధించింది. దుబయ్ ఫ్లైట్ ఎక్కేముందు పోలీసులు అరెస్ట్ చేశారు.

మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో అరెస్ట్.. 4 ఏళ్ల జైలు శిక్షతోపాటు 5 ఏళ్ల నిషేధం.. ఎవరంటే..?
Tamim Rehman

Updated on: Jan 28, 2026 | 6:29 PM

LPL Match Fixing: లంక ప్రీమియర్ లీగ్ మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో కీలక తీర్పు వెలువడింది. దంబుల్లా థండర్స్ యజమాని తమీమ్ రెహమాన్‌ను కోర్టు దోషిగా తేల్చింది. అతనికి నాలుగు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అయితే ఈ శిక్షతోపాటు, అతనిపై ఐదు సంవత్సరాల నిషేధం, 24 మిలియన్ శ్రీలంక రూపాయల జరిమానా కూడా విధించింది. బంగ్లాదేశ్ మూలానికి చెందిన తమీమ్ రెహమాన్ తనపై ఉన్న ఆరోపణలను అంగీకరించాడు. టోర్నమెంట్ సమయంలో తాను బెట్టింగ్ ఏర్పాటు చేశానని, ఒక ఆటగాడితో ఫిక్సింగ్ గురించి చర్చించానని అతను అంగీకరించాడు.

ఇది కూడా చదవండి: Video: అదృష్టం అంటే నీదే భయ్యా..! డేంజరస్ బంతికి క్లీన్‌బౌల్డ్.. కట్‌చేస్తే.. ట్విస్ట్ చూస్తే అదిరిపోద్దంతే..!

ఇవి కూడా చదవండి

దుబాయ్ పారిపోవడానికి ప్రయత్నాలు..

శ్రీలంక అవినీతి నిరోధక చట్టం కింద తమీమ్ రెహమాన్ దోషిగా నిర్ధారించింది. ఇది 2019లో అమలులోకి వచ్చింది. రెహమాన్ 2024లో అరెస్టు అయ్యాడు. ఈ సంఘటన గురించి ఒక ఆటగాడు ఫిర్యాదు చేయడంతో మొత్తం విషయం వెలుగులోకి వచ్చింది. కొలంబో విమానాశ్రయంలో దుబాయ్‌కు పారిపోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు రెహమాన్ అరెస్టు చేశారు. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. రెహమాన్ బెయిల్‌పై విడుదలయ్యే ముందు చాలా వారాల పాటు జైలులో ఉన్నాడు. ఈ కేసులో దంబుల్లా జట్టు మేనేజర్‌గా ఉన్న పాకిస్తాన్ పౌరుడు ముజీబ్ ఉర్ రెహమాన్‌పై అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేశారు.

ఇది కూడా చదవండి: T20 World Cup 2026: సూపర్ 8లో టీమిండియా ప్రత్యర్థులు వీళ్లే.. లీగ్ మ్యాచ్‌లకు ముందే తేల్చేశారుగా..?

లంక ప్రీమియర్ లీగ్ చరిత్ర..

లంక ప్రీమియర్ లీగ్ 2020లో ప్రారంభమైంది. శ్రీలంకలోని ఐదు నగరాల పేర్లతో ఐదు జట్లు ఈ లీగ్‌లో పోటీపడతాయి. 2024 నాటికి టోర్నమెంట్ ఐదు సీజన్లు జరిగాయి. ప్రస్తుత ఛాంపియన్లు జాఫ్నా కింగ్స్, నాలుగుసార్లు గెలిచింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..