Shubman Gill: కెప్టెన్సీలో రాణించాలంటే విధేయత కూడా ఉండాలి.. గిల్‌ కామెంట్స్‌ హార్ధిక్‌ను ఉద్దేశించేనా?

|

Nov 29, 2023 | 7:45 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ వ్యవహరించనున్నాడు. హార్దిక్ పాండ్యా గుజరాత్‌ జట్టును వీడి ముంబై ఇండియన్స్‌కు తిరిగి వచ్చినందున ఈ యువ ఆటగాడికి కీలక బాధ్యతలు అప్పగించించారు. ఇప్పటికే ఆటగాడిగా తనను తాను నిరూపించుకున్న గిల్‌ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించేందుకు కూడా సిద్ధమయ్యాడు. అయితే గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన వెంటనే శుభ్‌మన్‌ గిల్‌ చేసిన కొన్ని కామెంట్స్‌  దుమారం రేపుతున్నాయి.

Shubman Gill: కెప్టెన్సీలో రాణించాలంటే విధేయత కూడా ఉండాలి.. గిల్‌ కామెంట్స్‌ హార్ధిక్‌ను ఉద్దేశించేనా?
Shubman Gill, Hardik Pandya
Follow us on

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ వ్యవహరించనున్నాడు. హార్దిక్ పాండ్యా గుజరాత్‌ జట్టును వీడి ముంబై ఇండియన్స్‌కు తిరిగి వచ్చినందున ఈ యువ ఆటగాడికి కీలక బాధ్యతలు అప్పగించించారు. ఇప్పటికే ఆటగాడిగా తనను తాను నిరూపించుకున్న గిల్‌ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించేందుకు కూడా సిద్ధమయ్యాడు. అయితే గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన వెంటనే శుభ్‌మన్‌ గిల్‌ చేసిన కొన్ని కామెంట్స్‌  దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా ఇటీవలే గుజరాత్‌ కు గుడ్‌ బై చెప్పిన హార్దిక్‌ పాండ్యానే ఉద్దేశించే గిల్‌ ఇలా మాట్లాడాడంటూ కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. కెప్టెన్సీ స్వీకరించిన తర్వాత గిల్‌ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను గుజరాత్ టైటాన్స్‌ తమ అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో షేర్‌ చేసింది. అందులో గిల్‌ లాయల్టీ (విధేయత) అంటూ మాట్లాడాడు. దీంతో ఒక్కసారిగా హార్దిక్‌ పాండ్యా మళ్లీ వార్తల్లోకి వచ్చాడు. కెప్టెన్సీ అనేక రకాల బాధ్యతలతో కూడి ఉంటుందని మనకు తెలుసు, అందులో కష్టపడి పనిచేయడం ముఖ్యమని, అందులో విధేయత కూడా ఒకటని గిల్ అన్నాడు. గిల్ లాయల్టీ అనే పదాన్ని ఉపయోగించిన వెంటనే నెటిజన్లు హార్దిక్ పాండ్యాను ట్రోల్ చేయడం ప్రారంభించారు. గత రెండు సీజన్లలో గుజరాత్ కెప్టెన్‌గా ఉన్న అతను అకస్మాత్తుగా ముంబై ఇండియన్స్ జట్టులో చేరిన సంగతి తెలిసిందే.

‘ఐపీఎల్‌లో ఆడటం ప్రతి ఆటగాడి కల. నాకు 7-8 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఐపీఎల్‌ మొదలైంది. ఇప్పుడు ఆ లీగ్‌లో ఒక జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం పెద్ద విషయం. కెప్టెన్సీకి క్రమశిక్షణ, కృషి, విధేయత చాలా అవసరం. నేను చాలా మంది పెద్ద కెప్టెన్ల జట్లలో ఆడాను. వారి నుంచి నేను నేర్చుకున్నది ఐపీఎల్‌లో నాకు ఉపయోగపడుతుందనుకుంటున్నా’ అని గిల్‌ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

గిల్ కామెంట్స్.. వీడియో

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..