T20 Cricket: టీ20 క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీలు కొట్టింది వీరే.. టాప్-5లో మనోళ్లు ఎవరున్నారంటే?

టీ20 క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు ఇప్పుడు జాన్ నికోల్ లాఫ్టీ పేరిట చేరింది. నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ నమీబియా బ్యాటర్‌ కేవలం 33 బంతుల్లోనే సెంచరీ సాధించి సరికొత్త రికార్డు సృష్టించాడు. దీంతో టీ20 క్రికెట్‌లో 35 లేదా అంతకంటే తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన ప్రపంచంలో 5వ బ్యాటర్‌ గా నిలిచాడు జాన్.

T20 Cricket: టీ20 క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీలు కొట్టింది వీరే.. టాప్-5లో మనోళ్లు ఎవరున్నారంటే?
Jan Nicol Loftie Eaton

Updated on: Feb 27, 2024 | 10:04 PM

టీ20 క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు ఇప్పుడు జాన్ నికోల్ లాఫ్టీ పేరిట చేరింది. నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ నమీబియా బ్యాటర్‌ కేవలం 33 బంతుల్లోనే సెంచరీ సాధించి సరికొత్త రికార్డు సృష్టించాడు. దీంతో టీ20 క్రికెట్‌లో 35 లేదా అంతకంటే తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన ప్రపంచంలో 5వ బ్యాటర్‌ గా నిలిచాడు. మరి టీ20 క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన టాప్-5 బ్యాటర్లు ఎవరో చూద్దాం రండి. మంగళవారం (ఫిబ్రవరి 27) నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో, నమీబియన్ బ్యాటర్‌ జాన్ నికోల్ కేవలం 33 బంతుల్లో 8 భారీ సిక్సర్లు 11 ఫోర్ల సహాయంతో మెరుపు సెంచరీ చేశాడు. దీంతో టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన బ్యాటర్ గా ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇక గతేడాది ఆసియా క్రీడల మ్యాచ్‌లో నేపాల్ జట్టు ఎడమచేతి వాటం బ్యాటర్‌ కుశాల్ మల్లా మంగోలియాపై సెంచరీతో విజృంభించాడు. కుశాల్ మల్లా కేవలం 34 బంతుల్లోనే సెంచరీ చేసి ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. 2017లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఆటగాడు డేవిడ్ మిల్లర్ 35 బంతుల్లోనే సెంచరీ చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు.

ఇక టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ 2017లో శ్రీలంకపై కేవలం 35 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. తద్వారా డేవిడ్ మిల్లర్ ప్రపంచ రికార్డును సమం చేశాడు. 2019లో చెక్ రిపబ్లిక్ ప్లేయర్ ఎస్ విక్రమశేఖర టర్కీపై కేవలం 35 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. తద్వారా డేవిడ్ మిల్లర్, రోహిత్ శర్మల రికార్డును సమం చేశాడు. కాగా నేపాల్ తో జరిగిన మ్యాచ్ లో జాన్ నికోల్ లాఫ్టీ మొత్తం 36 బంతులు ఎదుర్కొన్నాడు. 8 భారీ సిక్సర్లు, 11 ఫోర్లతో 101 పరుగులు చేసి అవుటయ్యాడు. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోరు చేసింది. 207 పరుగుల కఠినమైన లక్ష్యాన్ని ఛేదించచేందుకు బరిలోకి దిగిన నేపాల్ జట్టు 18.5 ఓవర్లలో 186 పరుగులకే ఆలౌటైంది. తద్వారా తొలి టీ20లో నమీబియా 20 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఇవి కూడా చదవండి

 

జాన్ మెరుపు సెంచరీ.. వీడియో ఇదుగో..

ఐసీసీ ట్వీట్ ..

గతంలో టీ20 ల్లో మెరుపు సెంచరీలు సాధించిన ప్లేయర్లు వీరే..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..