Liam Livingstone IPL 2022 Auction: ఈ ఆల్ రౌండర్‌పై కాసుల వర్షం కురిపించిన పంజాబ్.. ఎంతంటే?

Liam Livingstone Auction Price: ఇంగ్లండ్ ఆల్-రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ ఐపీఎల్ IPL 2022 వేలంలో కనీవినీ ఎరుగని ప్రైజ్ పొందాడు. ఐపీఎల్ 2022 వేలంలో లియామ్ లివింగ్‌స్టోన్ రూ . 11.50 కోట్లు దక్కించుకుని ఆశ్చర్యపరిచాడు.

Liam Livingstone IPL 2022 Auction: ఈ ఆల్ రౌండర్‌పై కాసుల వర్షం కురిపించిన పంజాబ్.. ఎంతంటే?
Liam Livingstone

Updated on: Feb 13, 2022 | 3:34 PM

Liam Livingstone Auction Price: ఇంగ్లండ్ ఆల్-రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్(Liam Livingstone)  ఐపీఎల్ IPL 2022 వేలం(IPL 2022 Auction)లో కనీవినీ ఎరుగని ప్రైజ్ పొందాడు. ఐపీఎల్ 2022 వేలంలో లియామ్ లివింగ్‌స్టోన్ రూ . 11.50 కోట్లు దక్కించుకుని ఆశ్చర్యపరిచాడు. పంజాబ్ కింగ్స్ (Punjab Kings) ఈ ఆటగాడిపై ఈ భారీ మొత్తంలో బిడ్ వేసి సొంతం చేసుకుంది. దీంతో లియామ్ లివింగ్‌స్టన్ ఐపీఎల్ వేలంలో అత్యధికంగా అమ్ముడైన మూడో ఇంగ్లిష్ ప్లేయర్‌గా నిలిచాడు. గత సీజన్‌లో ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌లో భాగంగా ఉన్నాడు. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు తొమ్మిది మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఇందులో అతని పేరు మీద 112 పరుగులు ఉన్నాయి. ఐపీఎల్‌లో ఇంకా తనదైన ముద్ర వేయలేకపోయినా.. టీ20 క్రికెట్‌లో లివింగ్‌స్టన్‌కు ఎలాంటి పేరుందో తెలిసిందే. 2021 సంవత్సరంలో, ఈ ఫార్మాట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్‌లలో ఈ ఆల్ రౌండర్ నిలిచాడు.

లియామ్ లివింగ్‌స్టన్ అంతర్జాతీయ క్రికెట్ గణాంకాలను పరిశీలిస్తే, అతని స్ట్రైక్ రేట్ 158 కంటే ఎక్కువగా ఉందని తేలింది. అతను 17 మ్యాచ్‌ల్లో 285 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది. అలాగే 12 వికెట్లు కూడా తీశాడు. అదే టీ20 క్రికెట్‌లో 164 మ్యాచ్‌లు ఆడి 4095 పరుగులు చేశాడు. అతని పేరు మీద రెండు సెంచరీలు, 23 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 67 వికెట్లు కూడా తీశాడు.

IPL వేలం 2022లో, ఈ ఇంగ్లండ్ ఆటగాడి బేస్ ధర రూ. 1 కోటి. కోల్‌కతా నైట్ రైడర్స్ అతని కోసం మొదట వేలం వేసింది. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కూడా చేరింది. ఇద్దరి మధ్య నాలుగు కోట్ల రూపాయల వరకు హోరాహోరీ పోరు నడిచింది. అనంతరం సీఎస్‌కే జట్టు వైదొలిగింది. ఇక్కడి నుంచి పంజాబ్ కింగ్స్ జట్టు వేలంలో చేరింది. KKR లివింగ్‌స్టన్ కోసం రూ. 6.25 కోట్ల వరకు బిడ్ చేసింది. అయితే పంజాబ్ మాత్రం తగ్గేదేలే అన్నట్లు బిడ్‌ను ముందుకు తీసుకెళ్లింది.

ఆ తర్వాత పంజాబ్‌కు పోటీగా గుజరాత్ టైటాన్స్ బిడ్ చేసింది. కానీ, పంజాబ్ ఈ ఆటగాడిని నిర్ణయించింది. ఇలాంటి పరిస్థితుల్లో గుజరాత్ కూడా చేతులెత్తేసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా లివింగ్ స్టన్ పైనే పందెం కాసింది. దీంతో బిడ్ రూ. 10 కోట్లు దాటింది. చివరకు రూ.11.50 కోట్ల బిడ్ తో లివింగ్ స్టన్ ను పంజాబ్ తీసుకుంది.

ఐపీఎల్‌లో అత్యంత ఖరీదైన ఇంగ్లండ్ ఆటగాళ్లు..
ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఇంగ్లండ్‌కు చెందిన అత్యంత ఖరీదైన ఆటగాడిగా బెన్ స్టోక్స్ నిలిచాడు. 2017లో రూ. 14.50 కోట్లకు రైజింగ్ పూణె సూపర్‌జెయింట్స్ అతడిని కైవసం చేసుకుంది. ఆ తర్వాత 2018లో స్టోక్స్‌ను రూ. 12.50 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ తీసుకుంది. అదే సమయంలో, 2017లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ. 12 కోట్లు చెల్లించి టెమల్ మిల్స్‌ను తీసుకుంది.

Also Read: IPL 2022: ధోని కంటే చాహర్ పెద్ద ఆటగాడా.. 14 కోట్లు ఎందుకు చెల్లించినట్లు..?

IPL 2022 Auction Live, Day 2: ఖలీల్, సకారియాపై కాసుల వర్షం.. అన్‌సోల్డ్ లిస్ట్‌లో చేరిన ఆ టాప్ ఆటగాడు