LLC 2023: లెజెండ్స్ లీగ్ క్రికెట్ షెడ్యూల్ వచ్చేసింది.. 3 జట్లు, 8 మ్యాచ్‌లు.. ఎప్పుడు, ఎలా చూడాలంటే..?

|

Mar 09, 2023 | 5:00 PM

ఇండియా మహరాజాస్‌కు గౌతమ్ గంభీర్, వరల్డ్ జెయింట్స్‌కు ఆరోన్ ఫించ్ కెప్టెన్లుగా బాధ్యతలు నిర్వర్తించబోతున్నారు. ఇక ఇండియన్ మహరాజాస్ టీమ్‌లో

LLC 2023: లెజెండ్స్ లీగ్ క్రికెట్ షెడ్యూల్ వచ్చేసింది.. 3 జట్లు, 8 మ్యాచ్‌లు.. ఎప్పుడు, ఎలా చూడాలంటే..?
Legends League Cricket 2023
Follow us on

Legends League Cricket: లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2023 సీజన్ రేపటి నుంచి ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో తొలి మ్యాచ్ ఇండియా మహరాజాస్, ఏషియా లయన్స్ మధ్య జరగనుంది. ఖతార్‌లోని దోహా వేదికగా జరగనున్న ఈ టోర్నీలో.. ఇండియా మహరాజాస్, ఏషియా లయన్స్‌, వరల్డ్ జెయింట్స్ జట్లు తలపడనున్నాయి. ప్రపంచ క్రికెట్‌లోని మాజీలు పాల్గొనే ఈ టోర్నీలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు కూడా భాగం కానున్నారు. ఆ క్రమంలోనే ఏషియా లయన్స్ జట్టుకు షాహిద్ అఫ్రిది కెప్టెన్‌గా ఉన్నాడు. ఇక ఇండియా మహరాజాస్‌కు గౌతమ్ గంభీర్, వరల్డ్ జెయింట్స్‌కు ఆరోన్ ఫించ్ కెప్టెన్లుగా బాధ్యతలు నిర్వర్తించబోతున్నారు. ఇక ఇండియన్ మహరాజాస్ టీమ్‌లో గంభీర్‌తోపాటు మురళీ విజయ్, ఇర్ఫాన్ పఠాన్, సురేశ్ రైనా, యూసుఫ్ పఠాన్, హర్భజన్ సింగ్, శ్రీశాంత్ లాంటి మాజీ క్రికెటర్లు ఉన్నారు. మరోవైపు ఏషియా లయన్స్‌ జట్టులో అఫ్రిదితోపాటు అబ్దుల్ రజాక్, మిస్బావుల్ హక్, మహ్మద్ హఫీజ్ లాంటి పాక్ మాజీ ప్లేయర్లు ఆడనున్నారు.

లెజెండ్స్ లీగ్ క్రికెట్ పూర్తి షెడ్యూల్:

లెజెండ్స్ లీగ్ క్రికెట్ శుక్రవారం అంటే మార్చి 10 నుంచి ప్రారంభం కాబోతోంది. తొలి మ్యాచ్‌ గంభీర్ నాయకత్వంలోని ఇండియా మహరాజాస్, అఫ్రిది కెప్టెన్సీలోని ఏషియా లయన్స్ మధ్య జరుగుతుంది. మ్యాచ్‌లు అన్నీ కూడా భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతాయి.

ఇవి కూడా చదవండి
  • శుక్రవారం, మార్చి 10: ఇండియా మహారాజాస్ vs ఏషియా లయన్స్
  • శనివారం, మార్చి 11: ఇండియా మహారాజాస్ vs వరల్డ్ జెయింట్స్
  • సోమవారం, మార్చి 13: వరల్డ్ జెయింట్స్ vs ఏషియా లయన్స్
  • మంగళవారం, మార్చి 14: ఇండియా మహారాజాస్ vs ఏషియా లయన్స్
  • బుధవారం, మార్చి 15: ఇండియా మహారాజాస్ vs వరల్డ్ జెయింట్స్
  • గురువారం, మార్చి 16: వరల్డ్ జెయింట్స్ vs ఏషియా లయన్స్
  • శనివారం, మార్చి 18: ఎలిమినేటర్
  • సోమవారం, మార్చి 20: ఫైనల్

లెజెండ్స్ లీగ్ క్రికెట్ పూర్తి జట్లు:

ఇండియా మహరాజాస్: గౌతమ్ గంభీర్(కెప్టెన్), మహ్మద్ కైఫ్, మురళీ విజయ్, రైనా, ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, మన్విందర్ బిస్లా, రాబిన్ ఉతప్ప, అశోక దిండా, హర్భజన్, జోగిందర్ శర్మ, పర్విందర్ ఆవానా, ప్రఙ్ఞాన్ ఓజా, ప్రవీణ్ కుమార్, ప్రవీణ్ తాంబె, శ్రీశాంత్, స్టువర్ట్ బిన్నీ.

వరల్డ్ జెయింట్స్: ఆరోన్ ఫించ్(కెప్టెన్), క్రిస్ గేల్, హషీమ్ ఆమ్లా, రాస్ టేలర్, షేన్ వాట్సన్, ఆల్బీ మోర్కెల్, జాక్ కలిస్, కెవిన్ ఓబ్రైన్, మార్నీ వాన్ విక్, బ్రెట్ లీ, మాంటీ పనేసర్, లెండిల్ సిమన్స్, పాల్ కాలింగ్‌వుడ్, మోర్నీ మోర్కెల్.

ఏషియా లయన్స్: షాహిద్ అఫ్రిది(కెప్టెన్), మురళీధరన్, అస్ఘర్ ఆఫ్ఘన్, మిస్బావుల్ హక్, రజిన్ సలే, అబ్దుల్ రజాక్, పరాస్ ఖాడ్కా, తిసర పెరీరా, దిల్షాన్, తరంగ, దిల్హర ఫెర్నాండో, షోయబ్ అక్తర్, మహ్మద్ హఫీజ్, సోహైల్ తన్వీర్, మహ్మద్ ఆమీర్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..