Kuldeep Yadav : పెళ్లి కోసం బీసీసీఐకి సెలవు అప్లికేషన్ పెట్టుకున్న కులదీప్ యాదవ్..ఇంతకీ వధువు ఎవరంటే ?

భారత క్రికెట్ జట్టు స్టార్ స్పిన్నర్ కులదీప్ యాదవ్ తన జీవితంలో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించడానికి సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో ఆడుతున్న కులదీప్, తన పెళ్లి కోసం బీసీసీఐకి సెలవు కోరుతూ విజ్ఞప్తి చేసినట్లు మీడియా నివేదికలు చెబుతున్నాయి.

Kuldeep Yadav : పెళ్లి కోసం బీసీసీఐకి సెలవు అప్లికేషన్ పెట్టుకున్న కులదీప్ యాదవ్..ఇంతకీ వధువు ఎవరంటే ?
Kuldeep Yadav (1)

Updated on: Nov 15, 2025 | 10:29 AM

Kuldeep Yadav : భారత క్రికెట్ జట్టు స్టార్ స్పిన్నర్ కులదీప్ యాదవ్ తన జీవితంలో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించడానికి సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో ఆడుతున్న కులదీప్, తన పెళ్లి కోసం బీసీసీఐకి సెలవు కోరుతూ విజ్ఞప్తి చేసినట్లు మీడియా నివేదికలు చెబుతున్నాయి. ఒకవేళ బీసీసీఐ ఈ సెలవును మంజూరు చేస్తే, కులదీప్ కీలకమైన టెస్ట్, వన్డే మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది.

కులదీప్ యాదవ్ తన చిన్ననాటి స్నేహితురాలు వంశికతో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాడు.2025 జూన్ 4న లక్నోలో జరిగిన ఒక ప్రైవేట్ వేడుకలో వీరి నిశ్చితార్థం జరిగింది. ఆ కార్యక్రమానికి క్రికెటర్ రింకూ సింగ్‌తో పాటు సన్నిహితులు హాజరయ్యారు. కులదీప్ పెళ్లి నవంబర్ చివరి వారంలో జరిగే అవకాశం ఉంది. బీసీసీఐ వర్గాలు కూడా కులదీప్ సెలవు అడిగినట్లు ధృవీకరించాయి.

నవంబర్ చివరి వారంలో సెలవు అడగడం వలన, కులదీప్ యాదవ్ సౌతాఫ్రికాతో జరగబోయే సిరీస్‌లోని కొన్ని ముఖ్యమైన మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది. భారత్ vs సౌత్ ఆఫ్రికా మధ్య రెండవ టెస్ట్ నవంబర్ 22 నుంచి గువహటిలో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు కులదీప్ అందుబాటులో ఉండకపోవచ్చు. ఆ తర్వాత నవంబర్ 30 నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌కు కూడా ఆయన దూరం కావొచ్చు. టీమ్ మేనేజ్‌మెంట్ కులదీప్ సేవలు ఎప్పుడు అవసరమో అంచనా వేసి, సెలవుపై తుది నిర్ణయం తీసుకుంటుంది.

ప్రస్తుతం కులదీప్ యాదవ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో సౌతాఫ్రికాతో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్‌లో భారత ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆడుతున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత్ నలుగురు స్పిన్నర్లను (కుల్దీప్, జడేజా, సుందర్, అక్షర్ పటేల్) తీసుకుంది. కాగా, గతంలో భారత్-పాకిస్థాన్ సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ షెడ్యూల్ ఆలస్యం కావడంతో, కులదీప్ తన పెళ్లిని వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..