Kuldeep Yadav: తొలగించలేదు.. అసలు కథ వేరే ఉంది.. కుల్‌దీప్ దూరమవ్వడంపై బీసీసీఐ క్లారిటీ

Kuldeep Yadav: శ్రీలంకతో రెండో టెస్టుకు కుల్‌దీప్ యాదవ్ దూరమవ్వడంపై బీసీసీఐ కీలక క్లారిటీ ఇచ్చింది. జట్టు నుంచి తొలగించలేదని, వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతోనే తుది జట్టులోకి తీసుకోలేదని వెల్లడించింది. ఆయన స్థానంలో సారాంశ్ జైన్ అరంగేట్రం చేశారు. కుల్‌దీప్ త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Kuldeep Yadav: తొలగించలేదు.. అసలు కథ వేరే ఉంది.. కుల్‌దీప్ దూరమవ్వడంపై బీసీసీఐ క్లారిటీ
Kuldeep Yadav

Updated on: Aug 23, 2026 | 1:04 PM

Kuldeep Yadav: శ్రీలంకతో కొలంబో వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా చైనామన్ స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ బరిలోకి దిగకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. మొదటి టెస్టులో ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో ఆయనపై వేటు వేశారని అంతా భావించారు. అయితే ఈ విషయంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) క్లారిటీ ఇచ్చింది. కొలంబోలో ప్రారంభమైన రెండో టెస్టులో కుల్‌దీప్ యాదవ్ స్థానంలో ఆఫ్ స్పిన్నర్ సారాంశ జైన్‌కు అవకాశం లభించింది. శ్రీలంక తుది జట్టులో ఎక్కువ మంది లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు ఉండటంతోనే సారాంశ్‌ను బరిలోకి దించారని ప్రచారం సాగింది. గాల్‌ వేదికగా జరిగిన మొదటి టెస్టులో కుల్‌దీప్ కేవలం ఒక వికెట్ మాత్రమే తీసి నిరాశపరిచారు. ఈ ప్రదర్శన కారణంగానే ఆయనను పక్కనబెట్టారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే దీనిని బీసీసీఐ తీవ్రంగా ఖండించింది.

ఆరోగ్య సమస్యలతోనే విరామం

కుల్‌దీప్ యాదవ్ జట్టుకు దూరం కావడంపై బీసీసీఐ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆయన తీవ్రమైన వైరల్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారని తెలిపింది. “కుల్‌దీప్ యాదవ్ ఇన్ఫెక్షన్ నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. దీంతో శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ తుది జట్టు ఎంపికకు ఆయన అందుబాటులో లేకుండా పోయారు. అయితే మ్యాచ్ సమయంలో అవసరమైతే కన్కషన్ సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలోకి దిగేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు” అని బిసిసిఐ వెల్లడించింది.

ఇది కూడా చదవండి: Vaibhav Sooryavanshi: అంత హైప్ ఇచ్చారు.. చివరికి 8 పరుగులేనా! వైభవ్‌కు తొలి మ్యాచ్‌లోనే గట్టి దెబ్బ

టాస్ సమయంలో గిల్ క్లారిటీ

టాస్ సమయంలో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. కుల్‌దీప్ ఇన్ఫెక్షన్ కారణంగానే ఆడటం లేదని, ఆయన స్థానంలో ఇండోర్ ఆఫ్ స్పిన్నర్ సారాంశ జైన్ అరంగేట్రం చేస్తున్నారని గిల్ చెప్పారు. దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న సారాంశ్‌కు ఇది మంచి అవకాశంగా మారనుంది.

ఇది కూడా చదవండి:Yash Chandra Prakash: ధోని స్ఫూర్తితో UPSCలో సక్సెస్! ఇప్పుడు నాగర్ కర్నూల్‌ ఎఫ్‌డీఓగా..

టీమిండియా పటిష్ట స్థితి

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు సీనియర్ల వికెట్లు త్వరగానే కోల్పోయినా, సారాంశ జైన్ బౌలింగ్ విభాగంలో ఏ మేరకు రాణిస్తారో చూడాలి. పిచ్ నుంచి స్పిన్‌కు అనుకూలత లభిస్తున్న నేపథ్యంలో భారత స్పిన్ దళంపై భారీ అంచనాలు ఉన్నాయి. కుల్‌దీప్ త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. కుల్‌దీప్ యాదవ్‌ను జట్టు నుంచి తొలగించలేదని, కేవలం ఆరోగ్య కారణాల వల్లే ఆయన దూరమయ్యారని బీసీసీఐ క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us