IPL Auction 2026 : రూ.9.20కోట్లతో కట్టర్ల మాస్టర్‎ను కొనుగోలు చేసిన కేకేఆర్.. ఇక దబిడిదిబిడే

IPL Auction 2026 : ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్‎లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు బంగ్లాదేశ్ స్టార్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్‎ను భారీ ధరకు కొనుగోలు చేసింది. వేలంలో ఇతని కోసం పలు ఫ్రాంచైజీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ముస్తాఫిజుర్‌ను కేకేఆర్ జట్టు ఏకంగా రూ.9.20 కోట్ల భారీ ధరకు సొంతం చేసుకుంది.

IPL Auction 2026 : రూ.9.20కోట్లతో కట్టర్ల మాస్టర్‎ను కొనుగోలు చేసిన కేకేఆర్.. ఇక దబిడిదిబిడే
Bangladesh Pacer Mustafizur Rahman

Updated on: Dec 16, 2025 | 7:12 PM

IPL Auction 2026 : ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్‎లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు బంగ్లాదేశ్ స్టార్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్‎ను భారీ ధరకు కొనుగోలు చేసింది. వేలంలో ఇతని కోసం పలు ఫ్రాంచైజీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ముస్తాఫిజుర్‌ను కేకేఆర్ జట్టు ఏకంగా రూ.9.20 కోట్ల భారీ ధరకు సొంతం చేసుకుంది. ఈ కొనుగోలు కేకేఆర్ బౌలింగ్ విభాగాన్ని పటిష్టం చేసే దిశగా వేసిన ఒక వ్యూహాత్మక అడుగుగా క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

ది ఫిజ్ అని ముద్దుగా పిలుచుకునే ముస్తాఫిజుర్ రెహమాన్ ప్రపంచ టీ20 క్రికెట్‌లో అత్యంత ప్రమాదకరమైన బౌలర్లలో ఒకడు. అతని ప్రధాన బలం డెత్ ఓవర్లలో అతను వేసే అద్భుతమైన కట్టర్ బంతులు. ఈ కట్టర్లతో బ్యాట్స్‌మెన్‌ను అయోమయానికి గురిచేసి వికెట్లు తీయడంలో రెహమాన్ సిద్ధహస్తుడు. ఐపీఎల్లో ఆడిన అనుభవం ఉండటం కూడా అతని ధర పెరగడానికి ఒక కారణం. అతను గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ వంటి జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ముస్తాఫిజుర్ రాకతో కేకేఆర్ జట్టు బౌలింగ్ అటాక్, ముఖ్యంగా ఇన్నింగ్స్ చివర్లో (డెత్ ఓవర్లలో) మరింత పదునెక్కి, ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌లకు కఠిన సవాలు విసరనుంది.

కేకేఆర్ ఈ సీజన్‌లో భారతీయ యంగ్ టాలెంటుతో పాటు, ముస్తాఫిజుర్ వంటి నిరూపితమైన అంతర్జాతీయ మ్యాచ్ విన్నర్లను కూడా లక్ష్యంగా చేసుకుంది. రాహుల్ త్రిపాఠిని బేస్ ప్రైస్ రూ.75 లక్షలకే కొనుగోలు చేయడం, టిమ్ సీఫెర్ట్‌ను రూ.1.50 కోట్లకు దక్కించుకోవడంతో పాటు, ముస్తాఫిజుర్‌పై భారీగా పెట్టుబడి పెట్టడం ద్వారా కేకేఆర్ ఒక బలమైన, బ్యాలెన్సుడ్ జట్టును నిర్మించుకోవడానికి ప్రయత్నిస్తోంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..