Virat Kohli Retirement: కోహ్లీ రిటైర్మెంట్‌పై స్పందించిన గౌతమ్‌ గంభీర్‌! ఏమన్నాడంటే..?

విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో క్రికెట్ అభిమానులు షాక్‌కు గురయ్యారు. కోహ్లీ రిటైర్మెంట్ పై టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ స్పందిస్తూ తన విచారాన్ని వ్యక్తం చేశాడు. అయితే, కొంతమంది అభిమానులు గంభీర్ పైనే కోపం వ్యక్తం చేస్తూ, కోహ్లీ రిటైర్మెంట్‌కు గంభీర్ కారణమని విమర్శిస్తున్నారు.

Virat Kohli Retirement: కోహ్లీ రిటైర్మెంట్‌పై స్పందించిన గౌతమ్‌ గంభీర్‌! ఏమన్నాడంటే..?
Gautam Gambhir And Virat Ko

Updated on: May 12, 2025 | 2:23 PM

టీమిండియా హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ విరాట్‌ కోహ్లీ టెస్ట్‌ రిటైర్మెంట్‌పై స్పందించాడు. “ఏ మ్యాన్‌ విత్‌ లయన్స్‌ ప్యాషన్‌” విల్‌ మిస్‌ యూ చీక్స్‌ అని పేర్కొన్నాడు. కాగా విరాట్‌ కోహ్లీ టెస్ట్‌ ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించడం క్రికెట్‌ అభిమానులను షాక్‌కు గురిచేసింది. ఎవ్వరూ కూడా కోహ్లీ రిటైర్‌ అవ్వాలని కోరుకోలేదు. టెస్ట్‌, వన్డేల్లో విరాట్‌ కోహ్లీ కనీసం మరో మూడేళ్లు అయినా చాలా ఈజీగా ఆడే సత్తా ఉంచుకొని, ఎందుకు రిటైర్‌ అయ్యావంటూ అంతా కోహ్లీని ప్రశ్నిస్తున్నారు. కొంతమంది మాత్రం విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ రిటైర్మెంట్‌ వెనుక గౌతమ్‌ గంభీరే ఉన్నాడంటూ విమర్శలు చేస్తున్నారు.

కోహ్లీ రిటైర్మెంట్‌పై గౌతమ్‌ గంభీర్‌ ట్వీట్‌ చేయగా ఆ ట్వీట్‌కు రిప్లే ఇస్తూ అభిమానులు గంభీర్‌ను తిట్టిపోస్తున్నారు. నీ వల్లే రోహిత్‌, కోహ్లీ రిటైర్‌ అయ్యారంటూ మండిపడుతున్నారు. కాగా కోహ్లీ రిటైర్మెంట్‌ గురించి కొన్ని రోజుల క్రితమే వార్తలు వచ్చాయి. తన రిటైర్మెంట్‌ గురించి కోహ్లీ బీసీసీఐకి చెప్పాడని వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే అవన్నీ ఫేక్‌ అని, అవి నిజం కావొద్దని ఫ్యాన్స్‌ కోరుకున్నారు. కానీ, చివరికి అవే నిజం అయ్యాయి. కోహ్లీ కోట్ల మంది అభిమానుల హృదయాలను ముక్కలు చేస్తూ టెస్ట్‌ క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పేశాడు. ఒక బ్యాటర్‌గానే కాక.. ముఖ్యంగా కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లీ టెస్ట్‌ క్రికెట్‌పై తనదైన ముద్ర వేశాడు. రోహిత్‌ శర్మ రిటైర్మెంట్‌ ప్రకటించిన తర్వాత కోహ్లీకి కెప్టెన్సీ ఇవ్వాలనే డిమాండ్‌ కూడా వినిపించింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..