Ind Vs Eng: కేఎల్ రాహుల్ ఖాతాలో వరస్ట్ రికార్డు.. వరుసగా మూడు ఇన్నింగ్స్‌లో డకౌట్..!

|

Mar 17, 2021 | 12:09 PM

KL Rahul Record: ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న టీ20 సిరీస్‌లో టీమిండియా ఓపెనర్ కెఎల్ రాహుల్ పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. వరుసగా రెండు మ్యాచ్‌లో..

Ind Vs Eng: కేఎల్ రాహుల్ ఖాతాలో వరస్ట్ రికార్డు.. వరుసగా మూడు ఇన్నింగ్స్‌లో డకౌట్..!
కేఎల్ రాహుల్
Follow us on

KL Rahul Record: ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న టీ20 సిరీస్‌లో టీమిండియా ఓపెనర్ కెఎల్ రాహుల్ పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. వరుసగా రెండు మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుదిరిగి.. ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20లకు ఓపెనర్‌గా బరిలోకి దిగిన రాహుల్.. మొదటి మ్యాచ్‌లో తన పరుగుల ఖాతాను తెరిచినా.. ఆ తర్వాత రెండు మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. దీనితో వరుసగా రెండు అంతర్జాతీయ టీ20ల్లో డకౌట్ అయిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. ఈ పేలవ ఫామ్‌తో రాహుల్ తదుపరి మ్యాచ్‌కు తుది జట్టులో చోటు కోల్పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.

2020లో రాహుల్ టీ20లలో అద్భుత రికార్డు..

ఐపీఎల్ 2020లో కెఎల్ రాహుల్ టీ20లలో అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. పంజాబ్ కింగ్స్ జట్టుకు ఒంటిచేత్తో మ్యాచ్‌లు సైతం గెలిపించాడు. సుమారు 11 మ్యాచ్‌లలో 44.88 సగటుతో 404 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు అర్ధ సెంచరీలు ఉన్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి:

చుట్టూ భారీ అనకొండలు.. వాటితో ఆటలు.. ఇంతలోనే ఊహించని సంఘటన.. గగుర్పొడిచే వీడియో.!

భారీ పైథాన్‌తో ఫన్నీ గేమ్.. ప్రాణాల మీదకు తెచ్చుకున్న స్నేక్ క్యాచర్.. వైరల్ వీడియో.!

హోమ్‌లోన్ తీసుకుంటున్నారా.! అయితే ఈ విషయాలను తప్పక గుర్తించుకోండి.. లేదంటే.!