IPL 2022: ఐపీఎల్‌లో కెఎల్‌ రాహుల్‌ అరుదైన ఘనత.. నాలుగు సీజన్లలో..

ఐపీఎల్ 2022(IPL 2022)లో లక్నో సూపర్‌ జెయిం‍ట్స్‌(LSG) కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌(kl Rahul) అరుదైన ఘనత సాధించాడు. నాలుగు ఐపీఎల్ సీజన్లలో 600 పైగా పరుగులు చేసిన తొలి ఆటగాడిగా రాహుల్ రికార్డు సృష్టించాడు...

IPL 2022: ఐపీఎల్‌లో కెఎల్‌ రాహుల్‌ అరుదైన ఘనత.. నాలుగు సీజన్లలో..
Ipl 2022 Kl Rahul
Follow us

|

Updated on: May 26, 2022 | 11:05 AM

KL Rahul:  ఐపీఎల్ 2022(IPL 2022)లో లక్నో సూపర్‌ జెయిం‍ట్స్‌(LSG) కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌(kl Rahul) అరుదైన ఘనత సాధించాడు. నాలుగు ఐపీఎల్ సీజన్లలో 600 పైగా పరుగులు చేసిన తొలి ఆటగాడిగా రాహుల్ రికార్డు సృష్టించాడు. ఐపీఎల్‌-2022లో రాహుల్‌ 616 పరుగులు సాధించాడు. అంతకు ముందు క్రిస్ గేల్, డేవిడ్ వార్నర్ మూడు సీజన్లలో 600 పైగా పరుగులు సాధించారు. ఇక ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో మ్యాచ్‌లో కెఎల్‌ రాహుల్‌ 79 పరుగులు చేశాడు. కానీ ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీపై 14 పరుగుల తేడాతో లక్నో సూపర్‌ జెయిం‍ట్స్‌ ఓటమి పాలైంది. దీంతో టోర్నీ నుంచి లక్నో నిష్క్రమించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది.

రజత్‌ పటిదార్‌ 54 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్‌లతో 112 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దినేశ్‌ కార్తీక్‌ 23 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్‌తో 37 నాటౌట్‌గా నిలిచాడు. అనంతరం 208 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 193 పరుగులకే పరిమితమైంది. లక్నో బ్యాటర్లలో కేఎల్‌ రాహుల్‌(79), దీపక్‌ హుడా (45) పరుగులతో రాణించారు. లక్నోలో దీపక్‌ హుడా 45 పరుగులు చేయగా మిగతా వారు తక్కువ పరుగులకే ఔటయ్యారు. మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఫీల్డర్స్ విఫలమయ్యారు. రజత్‌ పాటిదార్‌ ఇచ్చిన రెండు క్యాచ్‌లను వదిలేశారు. దినేష్ కార్తిక్ క్యాచ్‌ను కెప్టెన్‌ కెఎల్‌ రాహుల్‌ జార విడిచాడు.

ఇవి కూడా చదవండి