RCB vs KKR: కోహ్లీపై కేకేఆర్‌ కుట్ర! మరీ ఇంత కన్నింగ్‌గా ఉన్నారేంటి భయ్యా?

|

Mar 22, 2025 | 11:20 AM

ఐపీఎల్ 2025 ప్రారంభ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరిగే పోటీకి ముందు, KKR ఆటగాళ్ళైన బిక్షు యాదవ్, ఆండ్రీ రస్సెల్ మరియు వరుణ్ చక్రవర్తి విరాట్ కోహ్లీ బ్యాటింగ్ శైలిని గమనించారు. కోహ్లీ బలహీనతలను గుర్తించి మ్యాచ్‌లో అతనిని త్వరగా అవుట్ చేయడమే వారి లక్ష్యం. ఈ రహస్య వ్యూహం గురించి వివరణ ఇక్కడ ఉంది.

RCB vs KKR: కోహ్లీపై కేకేఆర్‌ కుట్ర! మరీ ఇంత కన్నింగ్‌గా ఉన్నారేంటి భయ్యా?
Kkr Virat Kohli
Follow us on

ఐపీఎల్‌ 2025లో ఫస్ట్‌ మ్యాచ్‌ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ వర్సెస్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు. ఈ మ్యాచ్‌ గెలిచి ఈ మెగా సీజన్‌లో మంచి స్టార్ట్‌ అందుకోవాలని రెండు టీమ్స్‌ కూడా ముమ్మరంగా ప్రాక్టీస్‌ చేశాయి, నెట్స్‌లో చెమట నెత్తుర్లు పారించాయి. కానీ, కొంత మంది కేకేఆర్‌ ఆటగాళ్లు మాత్రం ప్రాక్టీస్‌ మానేసి.. ఆర్సీబీని దెబ్బేసేందుకు పెద్ద కన్నింగ్‌ ప్లాన్‌ వేశారు. అదేంటో తెలిస్తే.. వామ్మే వీల్లేంటి ఇలా ఉన్నారు అని పించక మానదు. ఇంతకీ ఆ కేకేఆర్‌ ఆటగాళ్లు ఎవరు? ఏం కుట్ర చేశారో ఇప్పుడు తెలుసుకుందాం.. బ్యాటింగ్‌లో ఆర్సీబీకి ప్రధాన బలం ఎవరంటే అందరూ టక్కున చెప్పే పేరు విరాట్‌ కోహ్లీ. అతను సరిగ్గా ఆడాడంటే.. మ్యాచ్‌ను జేబులో ఏస్కోని వెళ్లిపోతాడు. అందుకే ఏ టీమ్‌ అయినా ఆర్సీబీతో మ్యాచ్‌ అంటే విరాట్‌ కోహ్లీ గురించి ఓ ప్లాన్‌ రెడీ చేసుకుంది.

అయితే ఇక్కడ కేకేఆర్‌ ఆటగాళ్లు మాత్రం.. చేతబడి చేసేవాళ్లలా.. ఏకంగా గ్రౌండ్‌లోనే విరాట్‌ కోహ్లీ బ్యాటింగ్‌ చేస్తుంటే.. వాళ్ల ప్రాక్టీస్‌ పక్కనపెట్టి మరీ అలాగే చూస్తూ నిల్చున్నారు. కేకేఆర్‌ వర్సెస్‌ ఆర్సీబీ మ్యాచ్‌ కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో కావడంతో కోహ్లీ అండ్‌ కో అక్కడి వెళ్లి ఒక రోజు ముందు నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేశారు. అక్కడే మరో పక్క కేకేఆర్‌ ప్లేయర్లు కూడా ప్రాక్టీస్‌ చేస్తున్నారు. కోహ్లీ నెట్స్‌లో బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌కి రాగానే, కేకేఆర్‌ ఆటగాళ్లు మనం ముద్దుగా పిల్చుకునే బిక్షు యాదవ్‌ ఆండ్రీ రస్సెల్‌, మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి తమ ప్రాక్టీస్‌ను ఆపేసి మరీ వచ్చి కోహ్లీ బ్యాటింగ్‌ను చూస్తూ ఉండిపోయారు.

అందులో ఏముంది. కోహ్లీ మంచి స్టైలిష్‌ లెజెండరీ బ్యాటర్‌ కాబట్టి, కొద్ది సేపు అతని బ్యాటింగ్‌ చూసి ఎంజాయ్‌ చేస్తున్నారు అనుకుంటే మీరు పప్పులో కాదు.. తప్పులో కాలేసినట్టే. వాళ్లు చూసేది కోహ్లీ బ్యాటింగ్‌ కాదు.. కోహ్లీ ఏ బాల్‌ బాగా ఆడుతున్నాడు, ఏ బాల్‌కి ఇబ్బంది పడుతున్నాడు, ఎలాంటి షాట్లు ఎక్కువ ఆడుతున్నాడు అని ఆరా తీస్తున్నారు. ఎందుకంటే మ్యాచ్‌లో కోహ్లీని త్వరగా అవుట్‌ చేస్తేనే కదా కేకేఆర్‌కు విన్నింగ్‌ ఛాన్సులు పెరిగేది. అందుకే తమ ప్రాక్టీస్‌ మానేసి మరీ కోహ్లీ వీక్‌నెస్‌ పట్టుకోవాలని పనిగట్టుకొని చూశారు. ఇదంతా శుక్రవారం జరిగిన నెట్‌ సెషన్స్‌లో జరిగింది. కోహ్లీని అవుట్‌ చేసేందుకు మన బిక్షు యాదవ్‌, మిస్టరీ మ్యాన్‌ ఇలా కోహ్లీ బ్యాటింగ్‌కి ఫ్యాన్స్‌లా నటించారన్న మాట.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..