KKR vs RCB: కోహ్లీ సేనకు ఏమైంది..? భారీ అంచనాలను తుస్సుమనిపించారు.. ఈ సీజన్‌లోనే ఆర్‌సీబీ ఘోర పరాజయం

|

Sep 20, 2021 | 10:56 PM

KKR vs RCB: టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్‌సీబీ ప్రారంభం చాలా పేలవంగా కొనసాగింది. కేకేఆర్‌కు ఆర్‌సీబీ 93 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కేకేఆర్ టీం కేవలం 10 ఓవర్లలో కేవలం 1 వికెట్ కోల్పోయి విజయం సాధించారు.

KKR vs RCB: కోహ్లీ సేనకు ఏమైంది..? భారీ అంచనాలను తుస్సుమనిపించారు.. ఈ సీజన్‌లోనే ఆర్‌సీబీ ఘోర పరాజయం
Kkr Vs Rcb, Ipl 2021 Virat Kohli
Follow us on

KKR vs RCB: అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ని తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్‌సీబీ ప్రారంభం చాలా పేలవంగా కొనసాగింది. కేకేఆర్‌కు ఆర్‌సీబీ 93 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కేకేఆర్ టీం కేవలం 10 ఓవర్లలో కేవలం 1 వికెట్ కోల్పోయి సాధించారు. కేకేఆర్ ఓపెనింగ్ జంట ధాటికి ఆర్‌సీబీ బౌలర్లు చిత్తయ్యారు. ఓపెనర్ శుభమాన్ గిల్ 48 పరుగులు, వెంకటేష్ అయ్యర్ 27 బంతుల్లో 41 పరుగులు చేశారు. కేకేఆర్‌ విజయంలో వీరిద్దరు కీలకంగా వ్యవహరించి, తొలి వికెట్‌కు 82 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

అంతకు ముందు ఆర్‌సీబీ 92 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆర్‌సీబీ తరఫున దేవదత్ పడిక్కల్ అత్యధికంగా 22 పరుగులు చేశాడు. అతని తర్వాత ఎస్ భరత్ 16 పరుగులు చేశాడు. మ్యాక్స్‌వెల్ 10, ఏబీడీ 0, సచిన్ బేబీ 7, హసరంగా 0, జైమిసన్ 4, హర్షల్ పటేల్ 12, సిరాజ్ 8, చాహల్ 2 నాటౌట్‌గా నిలిచారు. అదే సమయంలో, విరాట్ తన 200 వ ఐపీఎల్ మ్యాచ్‌లో 5 పరుగులకే ఔట్ అయ్యాడు. మరో స్టార్ బ్యాట్స్‌మెన్ డివిలియర్స్ ఖాతా తెరవకుండానే గోల్గెన్ డక్‌గా వెనుదిరిగాడు. కేకేఆర్ బౌలర్లలో రస్సెల్ 3, వరుణ్ చక్రవర్తి 3, ఫెర్గ్యూసన్ 2, ప్రసీద్ధ్ ఒక వికెట్ పడగొట్టారు.

కోహ్లీ సేన ఈ సీజన్‌లో అత్యల్ప స్కోర్‌కు ఆలౌట్ అయింది. ఇందులో విరాట్ కో‎హ్లీ తొలి వికెట్‌గా వెనుదిరిగి టీంను తక్కువ పరుగులకు ఆలౌట్ అయ్యేందుకు మార్గం చూపించినట్లైంది. అసలే ఫాంలేమితో తంటాలు పడుతోన్న కోహ్లీకి, ఈ ఓటమి మరింత బాధను తెచ్చి పెట్టింది.

ఐపీఎల్‌లో ఆర్‌సీబీకి అత్యల్ప స్కోర్లు
49 vs కేకేఆర్ కోల్‌కతా 2017
70 vs ఆర్‌ఆర్ అబుదాబి 2014
70 vs సీఎస్‌కే చెన్నై 2019
82 vs కేకేఆర్ బెంగళూరు 2008
87 vs సీఎస్‌కే పోర్ట్ ఎలిజబెత్ 2009
92 vs కేకేఆర్ అబుదాబి 2021 *

Also Read:

England: పాకిస్తాన్‌కు మరో ఎదురు దెబ్బ.. పర్యటనను రద్దు చేసుకున్న ఇంగ్లండ్ టీం..!

KKR vs RCB Match Highlights, IPL 2021: కోహ్లీ సేన ఘోర పరాజయం.. 9 వికెట్ల తేడాతో కేకేఆర్ విజయం

KKR vs RCB: కేకేఆర్‌ మ్యాచ్‌లో కోహ్లీ కోసం ఎదురుచూస్తోన్న పలు రికార్డులు.. ధోని, రోహిత్‌లకు కూడా సాధ్యం కాలే.. అవేంటో తెలుసా?