KKR vs PBKS 1st Innings Highlights: తొలుత ధావన్.. చివర్లో షారుఖ్‌ల తుఫాన్ ఇన్నింగ్స్.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే?

|

May 08, 2023 | 9:29 PM

Kolkata Knight Riders vs Punjab Kings: టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. దీంతో కోల్‌కతా నైట్ రైడర్స్ ముందు 180పరుగుల టార్గెట్ నిలిచింది.

KKR vs PBKS 1st Innings Highlights: తొలుత ధావన్.. చివర్లో షారుఖ్‌ల తుఫాన్ ఇన్నింగ్స్.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే?
Kkr Vs Pbks 1st Innings
Follow us on

Kolkata Knight Riders vs Punjab Kings: ఇండియన్ ప్రీమియర్ లీగ్-16లో 53వ మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ మధ్య కొనసాగుతోంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో పంజాబ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. దీంతో కోల్‌కతా నైట్ రైడర్స్ ముందు 180పరుగుల టార్గెట్ నిలిచింది.

కోల్‌కతా తరపున వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లు తీయగా, హర్షిత్ రాణా రెండు వికెట్లు, కెప్టెన్ నితీశ్ రాణా, సుయాష్ శర్మలకు ఒక్కో వికెట్ దక్కింది.

ఇవి కూడా చదవండి

ధావన్ 50వ హాఫ్ సెంచరీ..

కోహ్లితో సమానంగా వచ్చిన ధావన్ కెరీర్ లో 50వ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 41 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ప్రస్తుత సీజన్‌లో ధావన్‌ది రెండో అర్ధశతకం. లీగ్‌లో అత్యధిక అర్ధశతకాలు సాధించిన భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో సమానంగా నిలిచాడు. కొద్ది రోజుల క్రితం విరాట్ కోహ్లీ కూడా తన 50వ అర్ధ సెంచరీని నమోదు చేసుకున్నాడు.

పవర్ ప్లేలోనే షాక్ తిన్న పంజాబ్..

బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ పవర్‌ప్లేలోనే 3 వికెట్లు కోల్పోయింది. దీంతో ఆ జట్టు 6 ఓవర్లలో 58 పరుగులు చేసింది. ఓపెనర్ ప్రభాసిమ్రాన్ 12, భానుక రాజపక్స 0, లియామ్ లివింగ్‌స్టోన్ 15 పరుగుల వద్ద ఔటయ్యారు. హర్షిత్ రాణాకు రెండు, వరుణ్ చక్రవర్తికి ఒక వికెట్ దక్కింది.

ఇరుజట్లు:

పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శిఖర్ ధావన్(కెప్టెన్), భానుకా రాజపక్స, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(కీపర్), సామ్ కర్రాన్, షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, రిషి ధావన్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్.

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్(కీపర్), వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా(కెప్టెన్), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, సుయాష్ శర్మ, వరుణ్ చక్రవర్తి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..