IPL 2022, KKR Vs GT: ఐపీఎల్ 2022 డబుల్ హెడర్‌లో భాగంగా కోల్‌కతాతో శనివారం జరుగుతున్న తొలి మ్యాచ్‌లో గుజరాత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సీజన్‌లో గుజరాత్ జట్టు తొలిసారి టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. గుజరాత్ టీం నిర్ణత 20 ఓవర్లలో 9 వికెట్లకు 156 పరుగులు చేసింది. దీంతో కోల్‌కతా టీం ముందు 157 పరుగులు టార్గెట్‌ను ఉంచింది. గుజరాత్ టీం తరపున హార్దిక్ 67 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిల్లర్ 27, సాహా 25 పరుగులతో రాణించారు. మిగతా బ్యాటర్స్ అంతగా రాణించలేదు. కోల్‌కతా బౌలర్లలో రస్సెల్ 4, టిమ్ సౌతీ 3, ఉమేష్ యాదవ్ 1, మావి 1 వికెట్ పడగొట్టారు. గత మ్యాచ్‌లో CSKపై 94 నాటౌట్‌తో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన డేవిడ్ మిల్లర్.. ఈ మ్యాచ్‌లోనూ తన తుఫాన్ శైలిని ప్రదర్శించాడు. 20 బంతుల్లో 27 పరుగులతో చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. శివమ్ మావి ఖాతాలో మిల్లర్ వికెట్ పడింది. డేవిడ్ మిల్లర్ తన ఇన్నింగ్స్‌లో తొలి సిక్స్ కొట్టడంతో పాటు ఐపీఎల్‌లో 100 సిక్సర్లు పూర్తి చేశాడు.
ఐపీఎల్‌లో 100 సిక్సర్లు బాదిన 27వ ఆటగాడిగా మిల్లర్ నిలిచాడు. హార్దిక్, మిల్లర్ మూడో వికెట్‌కు 37 బంతుల్లో 50 పరుగులు జోడించారు.
హార్దిక్ బలమైన పునరాగమనం..
హార్దిక్ పాండ్యా టోర్నమెంట్‌లో వరుసగా మూడో అర్ధశతకం పూర్తి చేశాడు. అతను 36 బంతుల్లో తన ఐపీఎల్ కెరీర్‌లో 7వ అర్ధశతకం సాధించాడు.
సాహా, హార్దిక్ భాగస్వామ్యం..
వృద్ధిమాన్ సాహా, హార్దిక్ పాండ్యా రెండో వికెట్‌కు 50 బంతుల్లో 75 పరుగులు జోడించారు. ఇద్దరు ఆటగాళ్లు కోల్‌కతా బౌలర్లను చాలా ఇబ్బంది పెట్టారు. ఈ భాగస్వామ్యాన్ని ఉమేష్ యాదవ్ సాహాను అవుట్ చేయడం ద్వారా బ్రేక్ చేశాడు. సాహా 25 బంతుల్లో 25 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. అతని క్యాచ్‌ని బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో వెంకటేష్ పట్టుకున్నాడు.
పవర్ ప్లేలో గుజరాత్ ప్రదర్శన..
తొలి 6 ఓవర్ల ఆట పూర్తిగా గుజరాత్ పేరిటే సాగింది. జట్టు రెండో ఓవర్‌లో గిల్ వికెట్ కోల్పోయింది. అయితే ఆ తర్వాత కెప్టెన్ హార్దిక్ పాండ్యా, వృద్ధిమాన్ సాహాలు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. పవర్ ప్లే వరకు స్కోరును 47 పరుగులకు తీసుకెళ్లారు. GT మొదటి 36 బంతుల్లో 7.83 రన్‌రేట్‌తో పరుగులు సాధించారు. ఈ సమయంలో జట్టు నుంచి 4 ఫోర్లు, 1 సిక్స్ వచ్చాయి.
రెండు జట్ల ప్లేయింగ్ XI..
హార్దిక్ అన్‌ఫిట్ కారణంగా గత మ్యాచ్‌లో ఆడలేదు. అయితే అతను ఈ మ్యాచ్‌కు వంద శాతం ఫిట్‌గా ఉన్నాడు. అదే సమయంలో, KKR 3 మార్పులు చేసింది. ఆరోన్ ఫించ్, పాట్ కమిన్స్, షెల్డన్ జాక్సన్ స్థానంలో శామ్ బిల్లింగ్స్, రింకు సింగ్, టిమ్ సౌథీలను ప్లే-11లో చేర్చింది.
KKR : వెంకటేష్ అయ్యర్, సునీల్ నరైన్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నితీష్ రానా, సామ్ బిల్లింగ్స్ (కీపర్), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, టిమ్ సౌతీ, శివమ్ మావి, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.
GT : వృద్ధిమాన్ సాహా (కీపర్), శుభమాన్ గిల్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, లాకీ ఫెర్గూసన్, యశ్ దయాల్, మహమ్మద్ షమీ.
మరిన్ని ఐపీఎల్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: DC Vs RR: నో బాల్ ఇవ్వకుంటే బయటకు వచ్చేయండి.. క్రీజ్‌లో ఉన్న ఆటగాళ్లకు రిషబ్ పంత్ పిలుపు..
KKR vs GT Live Score, IPL 2022: ముగిసిన గుజరాత్ ఇన్నింగ్స్.. కోల్‌కతా ముందు స్వల్ప లక్ష్యం..