KKR IPL 2022 Auction: ఫలించిన గంభీర్ స్కెచ్.. కీలక ప్లేయర్లను దక్కించుకున్న కేకేఆర్..!

|

Feb 12, 2022 | 7:01 PM

Kolkata Knight Riders players List: కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు రెండుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచింది. కేకేఆర్ ఇప్పటికే నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది.

KKR IPL 2022 Auction: ఫలించిన గంభీర్ స్కెచ్.. కీలక ప్లేయర్లను దక్కించుకున్న కేకేఆర్..!
Kkr Ipl 2022 Auction
Follow us on

కోల్‌కతా నైట్ రైడర్స్ 2012, 2014లో ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. గతేడాది ఫైనల్‌కు చేరినా.. మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయింది. ఐపీఎల్ 2022 (IPL 2022) లో జట్టు తన మూడవ టైటిల్ కోసం పోరాడుతుంది. దీని కోసం మెగా వేలంలో బలమైన జట్టును సిద్ధం చేయాలనుకుంటున్నారు. కోల్‌కతా వేలానికి ముందు తన నలుగురు ఆటగాళ్లను ఉంచుకుంది. చాలా మంది అనుభవజ్ఞులను వదిలివేసింది. KKR పాట్ కమ్మిన్స్‌ని నిలబెట్టుకోలేదు. కానీ, మళ్లీ వేలంలో చేర్చుకుంది. అలాగే శ్రేయాస్ అయ్యర్ కోసం రూ.12.5 కోట్లు ఖర్చు చేసింది. KKR కెప్టెన్‌గా అయ్యర్‌ని ఎంపిక చేయనున్నట్లు భావిస్తున్నారు.

2018 నుంచి జట్టు బ్యాటింగ్‌లో కీలక పాత్ర పోషించిన యువ బ్యాట్స్‌మెన్ శుభ్‌మాన్ గిల్‌ను కూడా KKR దక్కించుకోలేదు. ఫ్రాంచైజీ రిటైన్ చేసిన ఆటగాళ్లలో ఓపెనర్ వెంకటేష్ అయ్యర్, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, వెస్టిండీస్‌కు చెందిన సునీల్ నరైన్, గతేడాది తుఫాన్ ఇన్నింగ్సులు ఆడిన ఆండ్రీ రస్సెల్ పేర్లు ఉన్నాయి. రస్సెల్ కోసం KKR రూ.12 కోట్లు ఖర్చు చేసింది. వరుణ్, అయ్యర్ కోసం ఎనిమిది కోట్లు, నరేన్ కోసం ఆరు కోట్లు ఖర్చు చేశారు.

కోల్‌కతా నైట్ రైడర్స్ IPL 2022 వేలం ప్లేయర్స్..

ఆండ్రీ రస్సెల్ – రూ.12 కోట్లు

వరుణ్ చక్రవర్తి – రూ.8 కోట్లు

వెంకటేష్ అయ్యర్ – రూ.8 కోట్లు

సునీల్ నరైన్ – రూ.6 కోట్లు

పాట్ కమిన్స్ – రూ. 7.75 కోట్లు

శ్రేయాస్ అయ్యర్ – రూ. 12.25 కోట్లు

నితీష్ రాణా – రూ. 8 కోట్లు

Also Read: SRH, IPL 2022 Auction: సుందర్ కోసం కష్టాలు పడ్డ సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఎస్‌ఆర్‌హెచ్ జాబితాలో ఎవరు చేరారంటే?

Shardul Thakur IPL 2022 Auction: ధోని శిష్యుడిపై కాసుల వర్షం.. రెండు జట్ల మధ్య హోరాహోరీ పోటీ..