IPL 2023: టైటిల్‌ గెలిచేందుకు మా గేమ్‌ ప్లాన్‌ ఇదే.. కేకేఆర్‌ ఫీల్డింగ్‌ కోచ్ డష్కాటే ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్

|

Apr 07, 2023 | 12:08 PM

తాజా సీజన్‌లో కోల్‌కతాకు నితీశ్‌ రాణా సారథ్యం వహిస్తున్నాడు. రెగ్యులర్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ గాయపడడంతో అతని స్థానంలో నితీష్‌ కోల్‌కతాను ముందుకు నడిపించనున్నాడు. కాగా ఐపీఎల్‌-2023 లో కోల్‌కతాకు ఉన్న విజయవకాశాలు, ఆటగాళ్ల బలాలు, బలహీనతలపై ఆ జట్టు ఫీల్డింగ్‌ కోచ్‌ ర్యాన్‌ టెన్‌ డష్కాటే స్పోర్ట్స్‌ 9 ఛానెల్‌తో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

IPL 2023: టైటిల్‌ గెలిచేందుకు మా గేమ్‌ ప్లాన్‌ ఇదే.. కేకేఆర్‌ ఫీల్డింగ్‌ కోచ్ డష్కాటే ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్
Ryan Ten Doeschate
Follow us on

ఐపీఎల్‌-16 సీజన్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ బోణి కొట్టింది. పంజాబ్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో 7 పరుగుల తేడా(డక్‌ వర్త్‌ లూయిస్‌) తో పరాజయం పాలైన ఆ జట్టు గురువారం బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 81 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈడెన్‌ గార్డెన్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా సమష్ఠిగా రాణించింది. ముందుగా ఓపెనర్‌ రహమానుల్లా గుర్బాజ్ (44 బంతుల్లో 57 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) , శార్దూల్ ఠాకూర్‌ (29 బంతుల్లోనే 68 రన్స్‌ 9 ఫోర్లు, 3 సిక్సులు) అర్ధసెంచరీలతో జట్టుకు భారీస్కోరు అందించారు. ఆతర్వాత వరుణ్‌ చక్రవర్తి, సుయాశ్‌ శర్మ, సునీల్‌ నరైన్‌ తమ స్పిన్‌తో బెంగళూరు బ్యాటర్లను బోల్తా కొట్టించారు. ఆర్సీబీపై  విజయంతో కోల్‌కతా నెట్‌ రన్‌రేట్‌ కూడా మెరుగుపడింది. పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. కాగా తాజా సీజన్‌లో కోల్‌కతాకు నితీశ్‌ రాణా సారథ్యం వహిస్తున్నాడు. రెగ్యులర్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ గాయపడడంతో అతని స్థానంలో నితీష్‌ కోల్‌కతాను ముందుకు నడిపించనున్నాడు. కాగా ఐపీఎల్‌-2023 లో కోల్‌కతాకు ఉన్న విజయవకాశాలు, ఆటగాళ్ల బలాలు, బలహీనతలపై ఆ జట్టు ఫీల్డింగ్‌ కోచ్‌ ర్యాన్‌ టెన్‌ డష్కాటే స్పోర్ట్స్‌ 9 ఛానెల్‌తో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

ఈ సందర్భంగా ఐపీఎల్‌ 15 ఏళ్ల ప్రస్థానంపై స్పందించిన డష్కాటే..’ప్రపంచంలో అతిపెద్ద ఫ్రాంఛైజీ క్రికెట్‌ ఐపీఎల్‌. ఇది క్రికెట్‌ ప్రేమికులకు ఎంతో వినోదాన్ని అందిస్తోంది. అలాగే యువ ఆటగాళ్లు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి ఒక చక్కని వేదిక’ అని చెప్పుకొచ్చాడు. అలాగే కేకేఆర్‌ ఆల్‌రౌండర్లపైనే ఎక్కువగా ఆధారపడుతుంది. ఈసారి గేమ్‌ప్లాన్‌ ఎలా ఉండబోతుంది అన్న ప్రశ్నకు.. ‘ ఆండ్రీ రస్సెల్‌ లాంటి ఆల్‌రౌండర్స్‌ అటు బంతితోనూ, బాల్‌తోనూ రాణిస్తున్నారు. అయితే ఈసారి ఇంపాక్ట్‌ ప్లేయర్‌ నిబంధన ఉంది. గేమ్‌కు అనుగుణంగానే మా ప్లాన్స్‌ ఉంటాయి’ అని చెప్పుకొచ్చాడు. కేకేఆర్‌ మళ్లీ టైటిల్‌ గెలిచేందుకు మీ వద్ద ఎలాంటి ప్లాన్స్‌ ఉన్నాయి అన్న ప్రశ్నకు ‘ ఆటగాళ్లు గేమ్‌ను కంఫర్ట్‌బుల్‌గా ఆడాలి. ఆటను ఆస్వాదించాలి. ఓ కోచ్‌గా ఆటగాళ్లలో టెక్నిక్‌ సమస్యలను గుర్తించి వాటిని అధిగమించేలా సలహాలు, సూచనలు ఇస్తాం. మా హయాంలో కంటే ఇప్పుడు టీం సంఖ్య బాగా పెరిగింది. అలాగే పోటీ కూడా ఎక్కువైంది. టైటిల్‌ను గెలిచేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తాం’ అని చెప్పుకొచ్చాడు డష్కాటే. కేకేఆర్‌ జట్టు గురించి అతనేం మాట్లాడాతో ఈ కింది వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..