Kieron Pollard Retirement From IPL: ప్రపంచంలో అత్యధికంగా వీక్షించే లీగ్ మన ఐపీఎల్. చాలా మంది క్రికెటర్లు ఇక్కడ ఆడటం ద్వారా తమ కెరీర్‌ను అద్భుతంగా తీర్చిదిద్దుకుంటూ, జాతీయ జట్టులోనూ చోటు దక్కించుకుంటున్నారు. ఐపీఎల్‌లో ఆడటం ద్వారా డబ్బుతోపాటు పేరుకూడా పొందుతున్నారు. ఈరోజు (నవంబర్ 15న) అన్ని ఐపీఎల్ జట్లు ఆటగాళ్ల రిటెన్షన్, విడుదల జాబితాను బీసీసీఐకి సమర్పించాల్సి ఉంది. అయితే అంతకు ముందు స్టార్ ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్ రిటైర్ కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పటికే పొలార్డ్‌ను ముంబై నుంచి విడుదల చేస్తు్న్నట్లు వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ స్టార్ ప్లేయర్ రిటైర్మెంట్ చేసినట్లు భావిస్తు్న్నారు. అయితే రిటైర్మెంట్ చేసిన కొద్దిసేపట్లోనే పొలార్డ్ ముంబై ఇండియన్స్‌లో పునరాగమనం చేసేందుకు సిద్ధమయ్యాడు. ముంబై జట్టు ఈ వెస్టిండీస్ స్టార్ ప్లేయర్‌కు కీలక బాధ్యతలను అప్పగించింది.
కీరన్ పొలార్డ్ 2010 నుంచి ముంబై ఇండియన్స్‌తో అనుబంధం కలిగి ఉన్నాడు. ముంబై ఇండియన్స్ తరపున 13 సీజన్లు ఆడిన తర్వాత పొలార్డ్ రిటైరయ్యాడు. తాజాగా ముంబై ఇండియన్స్ పొలార్డ్‌ని బ్యాటింగ్ కోచ్‌గా మార్చేసింది. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ స్వయంగా ట్విట్టర్‌లో తెలియజేసింది. పొలార్డ్ ముంబైకి అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా ఉన్నాడు. ఆయన సేవలను ఎప్పటికీ వదులుకోం అంటూ ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కోచ్‌గా, ఎంఐ ఎమిరేట్స్‌లో ఆటగాడిగా కనిపిస్తాడని పేర్కొంది.
కీరన్ పొలార్డ్ తన తుఫాన్ బ్యాటింగ్‌కు ప్రసిద్ధి చెందాడు. అతను దశాబ్దానికి పైగా ముంబై ఇండియన్స్‌కు ఫినిషర్ పాత్రను పోషించాడు. ముంబై తరపున ఎన్నో మ్యాచ్‌లు సొంతంగా గెలిచాడు. బౌలింగ్‌లోనూ జట్టు విజయానికి దోహదపడ్డాడు. రోహిత్ శర్మ సారథ్యంలో ముంబై ఇండియన్స్ ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. ఇందులో పొలార్డ్ కీలక పాత్ర పోషించాడు.
Kieron Pollard player ✅
Kieron Pollard batting coach ➡️#OneFamily #MumbaiIndians @KieronPollard55 https://t.co/zWYHGVxzM7— Mumbai Indians (@mipaltan) November 15, 2022
కీరన్ పొలార్డ్ చాలా పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నాడు. అతడి బ్యాట్ నుంచి పరుగులు రాబట్టడం కష్టంగా మారింది. ఈ కారణంగా, IPL 2022 మధ్యలో కెప్టెన్ రోహిత్ శర్మ అతనిని ప్లేయింగ్ XI నుంచి తొలగించాడు. ఐపీఎల్‌లో 189 మ్యాచ్‌లు ఆడిన అతను 16 హాఫ్ సెంచరీలతో సహా 3412 పరుగులు చేశాడు. అదే సమయంలో అతను బంతితో అద్భుతాలు చేస్తూ, 69 వికెట్లు కూడా తీసుకున్నాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..