Video: అదేం బ్యాటింగ్‌ రా బాబు..! ఫ్రీ హిట్‌ మిస్‌.. కావ్య మారన్‌ చూడండి ఎలా రియాక్ట్‌ అయిందో!

ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది. 155 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది. మ్యాచ్‌ మధ్య లో కావ్య మారన్‌ ఎక్స్‌ప్రెషన్‌ వైరల్‌గా మారింది. ఈ విజయంతో ఎస్ఆర్హెచ్ ప్లేఆఫ్స్‌కు చేరే అవకాశాలు సజీవంగా ఉన్నాయి.

Video: అదేం బ్యాటింగ్‌ రా బాబు..! ఫ్రీ హిట్‌ మిస్‌.. కావ్య మారన్‌ చూడండి ఎలా రియాక్ట్‌ అయిందో!
Kavya Maaran

Updated on: Apr 26, 2025 | 11:01 AM

ఐపీఎల్‌ 2025లో భాగంగా శుక్రవారం చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ విజయం సాధించింది. హోం గ్రౌండ్‌లో ఆడుతూ తొలుత బ్యాటింగ్‌ చేసిన సీఎస్‌కే 19.5 ఓవర్లలో 154 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. ఇక 155 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఎస్‌ఆర్‌హెచ్‌ 18.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పో్యి లక్ష్యాన్ని ఛేదించింది. కచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ ఊపిరిపీల్చుకుంది. ఇక సీఎస్‌కే మాత్రం ఆల్‌మోస్ట్‌ ఈ సీజన్‌లో లీగ్‌ దశతోనే సరిపెట్టుకోవడం ఖాయంగా మారిపోయింది.

మ్యాచ్‌ సంగతి పక్కనపెడితే.. మ్యాచ్‌ మధ్యలో ఎస్‌ఆర్‌హెచ్‌ ఓనర్‌ కావ్య మారన్‌ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌, ఆమె ఫ్రస్టేషన్‌ గురైన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కావ్య ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌ ఎప్పుడూ హైలెట్‌ అవుతూనే ఉంటాయి. తాజాగా ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటర్‌ కమిందు మెండిస్‌ ఓ ఫ్రీ హిట్‌ను మిస్‌ చేసుకోవడంతో కావ్య ఫ్రస్టేషన్‌కు గురైంది. ఛీ.. అదేం బ్యాటింగ్‌, మంచి ఫ్రీ హిట్‌ను మిస్‌ చేసుకున్నావ్‌ అన్నట్లు ఎక్స్‌ప్రెషన్స్‌ ఇచ్చింది. ఆ ఎక్స్‌ప్రెషన్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఈ విజయంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 6 పాయింట్లకు చేరుకుంది. మొత్తం 9 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో ప్లే ఆఫ్స్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. అయినా కూడా ఎస్‌ఆర్‌హెచ్‌ మిగిలిన ఐదు మ్యాచ్‌ల్లో గెలిస్తేనే ప్లే ఆఫ్స్‌కు చేరుతుంది. సో రాబోయే ప్రతి మ్యాచ్‌ సైతం ఎస్‌ఆర్‌హెచ్‌కు డూ ఆర్‌ డై మ్యాచే. గత సీజన్‌లో ఆర్సీబీ సైతం ఆల్‌మోస్ట్‌ ఇలాంటి పరిస్థితుల్లోనే వరుసగా మ్యాచ్‌లు గెలుస్తూ ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది. మరి ఆర్సీబీని స్ఫూర్తిగా తీసుకొని.. ఎస్‌ఆర్‌హెచ్‌ కూడా అలాంటి మ్యాజిక్‌ చేస్తుందో లేదో చూడాలి.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..